Pahalgam Terror Attack : ఢిల్లీలో పాక్ హైకమిషన్ కార్యాల‌యం ద‌గ్గ‌ర ఉద్రిక్త‌త‌.. పాక్‌కు వ్యతిరేకంగా నినాదాలు, మరో సర్జికల్ స్రైక్‌కు డిమాండ్

భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్న పాకిస్తాన్ పై నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Pahalgam Terror Attack : ఢిల్లీలో పాక్ హైకమిషన్ కార్యాల‌యం ద‌గ్గ‌ర ఉద్రిక్త‌త‌.. పాక్‌కు వ్యతిరేకంగా నినాదాలు, మరో సర్జికల్ స్రైక్‌కు డిమాండ్

Updated On : April 24, 2025 / 4:50 PM IST

Pahalgam Terror Attack : ఢిల్లీలోని పాక్ హైకమిషనర్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ యాంటీ టెర్రర్ యాక్షన్ ఫోరమ్ ఆందోళన చేపట్టింది. పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికే పాక్ హైకమిషన్ ను ఖాళీ చేయాలంటూ కేంద్రం నోటీసులు ఇచ్చింది. భారత్ నోటీసులతో పాక్ హైకమిషన్ ను ఖాళీ చేస్తున్నారు సిబ్బంది. తమ సామానుతో కార్యాలయం వీడుతున్నారు.

పహల్గాం ఉగ్రదాడి వెనక పాకిస్తాన్ హస్తం ఉందంటూ కేంద్రం ప్రకటించిన తర్వాత ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయం వద్ద ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ముఖ్యంగా హిందువులనే టార్గెట్ చేసుకుని ఉగ్రదాడి జరగటం వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని కేంద్రం నిన్న నిర్ధారించింది.

అటు పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయం దగ్గర పోలీసు పహారా ఏర్పాటు చేశారు. ఎవరినీ లోనికి వెళ్లనివ్వడం లేదు. చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను అక్కడి నుంచి పంపేస్తున్నారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు ఆందోళనకారులు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడానికి ఇదే తగిన సమయం అని ప్రజలు అంటున్నారు. వెంటనే పీవోకేను స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన ఆ వ్యాఖ్యలే జమ్ముకశ్మీర్ లో ముష్కరుల మారణహామానికి కారణమా?

500 మందికి పైగా ప్రజలు పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. పొరుగు దేశంపై నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బీజేపీ, యాంటీ-టెర్రర్ యాక్షన్ ఫోరం వంటి వివిధ సామాజిక సంస్థలు నిరసనలో పాల్గొన్నాయి. ”గతంలో ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి మేము మళ్ళీ ఇలాంటి చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఇది అమాయక పర్యాటకులపై జరిగిన సిగ్గుచేటు దాడి. ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రణాళిక రూపొందించిందని మేము విశ్వసిస్తున్నాము” అని యాంటీ-టెర్రర్ యాక్షన్ ఫోరం సభ్యుడు తెలిపారు.

అనేక సంస్థలు నిరసనకు పిలుపునివ్వడంతో ఢిల్లీ పోలీసులు హైకమిషన్ వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు. హైకమిషన్ నుండి 500 మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేసి, నిరసనకారులను అక్కడే ఆపేశారు.