Delhi Liquor Policy Case : లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో తీహార్ జైలుకు కేజ్రీవాల్.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ!

Delhi Liquor Policy Case : రిమాండ్ దరఖాస్తులో కేజ్రీవాల్ విచారణకు సహకరించలేదని, తప్పించుకునే సమాధానాలు ఇచ్చారని సీబీఐ ఆరోపించింది. కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను సీబీఐ కోర్టుకు సమర్పించింది.

Delhi Liquor Policy Case : లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో తీహార్ జైలుకు కేజ్రీవాల్.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ!

Arvind Kejriwal Sent To 14-Day Judicial Custody In Delhi Liquor Policy Case ( Image Source : Google )

Delhi Liquor Policy Case : ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. మరింత దర్యాప్తు కోసం కేజ్రీవాల్‌ను కస్టడీలో ఉంచాల్సిన అవసరం ఉందని సీబీఐ కోర్టుకు విన్నవించింది. అందుకు అంగీకరించిన కోర్టు.. జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మూడు రోజుల సీబీఐ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరపర్చాలన్నా ఆదేశాలను ఈరోజు తెల్లవారుజామున ప్రత్యేక న్యాయమూర్తి సునేనా శర్మ రిజర్వ్ చేశారు.

Read Also : అమరావతి ప్రాంతంలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్ జారీ

రిమాండ్ దరఖాస్తులో కేజ్రీవాల్ విచారణకు సహకరించలేదని, తప్పించుకునే సమాధానాలు ఇచ్చారని సీబీఐ ఆరోపించింది. కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను సీబీఐ కోర్టుకు సమర్పించింది. జూలై 12వ తేదీ వరకు కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలోనే సీఎం కేజ్రీవాల్‌ను తీహార్ జైలుకు తరలించనున్నారు. వచ్చే నెల 12న మధ్యాహ్నం 2 గంటల సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరపర్చనున్నారు.

ఢిల్లీ 2021-22 కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం.. :
టోకు వ్యాపారులకు లాభాల మార్జిన్‌ను 5 శాతం నుంచి 12 శాతానికి పెంచడంపై ఆప్ అధినేత సరైన వివరణ ఇవ్వలేదని సీబీఐ పేర్కొంది. దేశంలో కోవిడ్ రెండో వేవ్ కొనసాగుతున్న సమయంలో సౌత్ గ్రూప్‌కు చెందిన నిందితులు ఢిల్లీల మకాం వేసిన సమయంలో ఎక్సైజ్ పాలసీకి క్యాబినెట్ ఆమోదం ఒక రోజులో హడావుడిగా సర్క్యులేషన్ ద్వారా అమలు చేయడంపై వివరణ ఇవ్వలేకపోయారని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఇందులో కేజ్రీవాల్ సన్నిహితుడు విజయ్ నాయర్‌తో కూడా సమావేశమైనట్టు ఆరోపించింది.

ఢిల్లీలో మద్యం వ్యాపారంలో వాటాదారులతో తన సహచరుడు విజయ్ నాయర్‌తో సమావేశాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలను కేజ్రీవాల్ దాటవేసినట్టు సెంట్రల్ ఏజెన్సీ ఆరోపించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు అర్జున్ పాండే, మూత గౌతమ్‌లను కలవడంపై కేజ్రీవాల్ సరైన వివరణ ఇవ్వలేకపోయారు.

ప్రముఖ రాజకీయ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎంతో ప్రభావవంతమైన వ్యక్తి కావడంతో ఆయన్ను కస్టడీ విచారణలోనే ఉంచాలని సీబీఐ అభిప్రాయపడింది. లేదంటే.. ఇప్పటికే బహిర్గతమైన సాక్షులు, సాక్ష్యాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ దరఖాస్తులో పేర్కొంది.

Read Also : అసెంబ్లీ సమావేశాలకు రావడానికి బీఆర్ఎస్‌లో కేటీఆర్, హరీశ్ రావు తప్ప ఎవరూ మిగలరు: ఎమ్మెల్యే యెన్నెం