Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌కు ఈడీ మూడవసారి సమన్లు
ఢిల్లీ మద్యం స్కాం మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మూడవసారి సమన్లు జారీ చేశారు. ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం జనవరి 3న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కు విచారణ సంస్థ సమన్లు పంపింది....

Arvind Kejriwal
Arvind Kejriwal : ఢిల్లీ మద్యం స్కాం మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మూడవసారి సమన్లు జారీ చేశారు. ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం జనవరి 3న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కు విచారణ సంస్థ సమన్లు పంపింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన సమన్లకు ప్రతిస్పందనగా, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తాను విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
ALSO READ : Assam Road Accident: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు- ట్రక్కు ఢీకొని 14మంది మృతి
అయితే ఈడీ తనకు నోటీసు జారీ చేయడం చట్టవిరుద్దమని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం నుంచి కేజ్రీవాల్ ను నిరోధించేందుకు తమ పార్టీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడానికి దర్యాప్తు సంస్థ ఉద్దేశించిందని ఆప్ ఆరోపించింది.ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ తెలిపింది.
ALSO READ : Japan Earthquake : జపాన్ భూకంపం…62కు పెరిగిన మృతుల సంఖ్య, మరిన్ని భూకంపాలు సంభవిస్తాయని అధికారుల హెచ్చరికలు
గత ఏడాది నవంబర్ 2, డిసెంబరు 21వతేదీల్లో ఈడీ రెండుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ, ఫెడరల్ ఏజెన్సీ ముందు హాజరు కావడానికి సీఎం నిరాకరించారు. రాజకీయ ప్రేరణతోనే తనకు మూడోసారి ఈడీ సమన్లు పంపించిందని కేజ్రీవాల్ ఆరోపించారు.