Auto Ambulances : కోవిడ్ రోగులకు గుడ్ న్యూస్.. ఆక్సిజన్ సౌకర్యం ఉన్న ఆటో అంబులెన్స్‌లు వచ్చేశాయి
అంబులెన్స్ అనగానే పెద్ద వాహనమే గుర్తుకొస్తుంది. నాలుగు చక్రాలతో కూడిన వ్యాన్లు అంబులెన్స్ లుగా ఉన్నాయి. కానీ, ఆటో అంబులెన్స్ లు ఎప్పుడైనా చూశారా? కనీసం విన్నారా? అవును ఆటో అంబులెన్స్ లు కూడా వచ్చేశాయి. అదీ ఆక్సిజన్ సౌకర్యం ఉన్నాయి.

Auto Ambulances
Auto Ambulances : అంబులెన్స్ అనగానే పెద్ద వాహనమే గుర్తుకొస్తుంది. నాలుగు చక్రాలతో కూడిన వ్యాన్లు అంబులెన్స్ లుగా ఉన్నాయి. కానీ, ఆటో అంబులెన్స్ లు ఎప్పుడైనా చూశారా? కనీసం విన్నారా? అవును ఆటో అంబులెన్స్ లు కూడా వచ్చేశాయి. అదీ ఆక్సిజన్ సౌకర్యం ఉన్నవి.
ఢిల్లీలో టర్న్ యువర్ కన్సర్న్ ఇన్ టూ యాక్షన్ (టీవైసీఐఏ) సంస్థ రాజ్యసభ సహకారంతో ఆటో అంబులెన్స్‌లను సిద్ధం చేసింది. దేశంలో కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో పెరిగి ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోతున్న సమయంలో బాధితులకు అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకొంది. టీవైసీఐఏ సంస్థ రాజ్యసభతో కలిసి 10 ఆటో అంబులెన్స్‌ను సిద్ధం చేసింది.
అత్యవసర పరిస్థితుల్లో ఉన్న కొవిడ్ పేషెంట్లను ఈ ఆటోరిక్షాల్లో ఆసుపత్రులకు చేరుస్తారు. ఈ ఆటో రిక్షాలు నిత్యం పూర్తిగా శానిటైజ్ చేసి ఆక్సిజన్‌తో అందుబాటులో ఉంచనున్నారు. ఈ విషయాన్ని టీవైసీఐఏ సంస్థ ట్విటర్ లో షేర్ చేసింది. ఈ ఆటో అంబులెన్స్ సంఖ్యను భవిష్యత్తులో మరింత పెంచేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది. రూ.25 లక్షల నిధులను సమీకరించి దేశ వ్యాప్తంగా ఇటువంటి ఆటో అంబులెన్స్‌ను ఏర్పాటు చేస్తామంది.
భారత్ లో కరోనా సునామీ కొనసాగుతోంది. మరోసారి రోజువారీ కేసుల సంఖ్య 4లక్షలు దాటింది. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 4.12 లక్షల కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇదే తీవ్రత కొనసాగితే జూన్ 11 నాటికి కొవిడ్ మరణాలు 4.04లక్షలను దాటేస్తాయని బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బృందం అంచనా వేసింది. ఇక అమెరికాలో వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మ్యాట్రిక్స్ అండ్ ఎవల్యూషన్ సంస్థ జులై చివరి నాటికి మృతుల సంఖ్య 10లక్షలు దాటుతుందని అంచనా కట్టింది.
స్వల్ప లక్షణాలు ఉండి, ఆక్సిజన్ సపోర్ట్ అవసరమైన కోవిడ్ రోగుల కోసం ఈ ఆటో అంబులెన్స్ లు తీసుకొచ్చారు. అలాంటి రోగులు వీరిని కాంటాక్ట్ చేయొచ్చు. అంబులెన్స్ తో కూడిన ఈ ఆటో రిక్షలో ఆక్సిజన్ సిలిండర్, శానిటైజర్ కూడా ఉంచారు. ఈ ఆటోలను నడిపే డ్రైవర్లు పీపీఈ కిట్లు ధరిస్తారు. స్వల్ప లక్షణాలు ఉండి, ఆక్సిజన్ అవసరం అయిన కరోనా రోగులను సరైన సమయానికి ఆసుపత్రులకు చేర్చాలనే లక్ష్యంతో ఈ ఆటో అంబులెన్స్ లు తీసుకొచ్చారు.
ఈ ఆటో అంబులెన్స్ లను బుక్ చేసుకోవడానికి రెండు ఫోన్ నెంబర్లు ఇచ్చారు. 9818430043, 011-41236614 నెంబర్లకు ఫోన్ చేయాలి. త్వరలోనే ఇలాంటివి మరో 20 ఆటో అంబులన్స్ లు ఢిల్లీలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఢిల్లీలో 12,53,902 కరోనా కేసులు నమోదయ్యాయి. 11.43లక్షల మంది కోలుకున్నారు. 18వేల 063 మంది కరోనాక బలయ్యారు. 91వేల 859 యాక్టివ్ కేసులు ఉన్నాయి.