దుర్గామాత మండపంపై…ఇస్లామిక్, క్రైస్తవ బొమ్మలు

  • Published By: veegamteam ,Published On : October 7, 2019 / 12:04 PM IST
దుర్గామాత మండపంపై…ఇస్లామిక్, క్రైస్తవ బొమ్మలు

Updated On : October 7, 2019 / 12:04 PM IST

వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్ కతాలో దసరా ఉత్సవాలు ెలా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే  బెలియాఘట 33 పల్లీ ప్రాంతంలో ఆదివాసీ బృందం పేరు మీద దుర్గామాత మంటపం వెలిసింది. ప్రతీ ఏడాది అక్కడ దేవీ శరన్నవ రాత్రులు ప్రారంభమైనప్పటి నుంచీ ఈ మండపంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహానికి వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు.

అయితే మహార్నవమి సందర్భంగా మండపాన్ని.. ఇస్లామిక్, క్రైస్తవ మత చిహ్నాలతో చాలా అందంగా అలంకరించారు. ఓంకారంతో పాటు ఇస్లాంకు గుర్తుగా భావించే అర్ధాకార చంద్రుడి నక్షత్రం, శిలువలతో కూడిన బ్యానర్లను పెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

కానీ ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలిపెట్టమని అక్కడి భారతీయ జనతాపార్టీ, విశ్వహిందూ పరిషత్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు బెలియాఘట 33 పల్లీ దుర్గామండపానికి చెందిన 10 మంది నిర్వాహకులపై స్థానిక న్యాయవాది శంతను సింఘా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా మరి కొందరు ఈ చర్యను సమర్థిస్తున్నారు. అన్ని మతాలు సమానమనే భావన ప్రజల్లో ఏర్పడాల్సిన అవసరం ఉందని చెప్పారు.