Bank Account KYC : బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. జనవరి 1 నుంచి ఆ అకౌంట్లు పని చేయవు..
బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. కేవైసీ(Know Your Customer) నిబంధనలకు అనుగుణంగా మీ అకౌంట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. లేదంటే ఇబ్బందులు తప్పవు. జనవరి 1 నుంచి కేవైసీ నిబంధనలకు అనుగుణంగా..

Bank Account Kyc
Bank Account KYC : బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. కేవైసీ(Know Your Customer) నిబంధనలకు అనుగుణంగా మీ అకౌంట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. లేదంటే ఇబ్బందులు తప్పవు. జనవరి 1 నుంచి కేవైసీ నిబంధనలకు అనుగుణంగా లేని బ్యాంకు ఖాతాలు పని చేయవు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కచ్చితంగా కేవైసీ రూల్స్‌ను అనుసరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కస్టమర్ల కేవైసీ వివరాలను క్రమం తప్పకుండా నిర్ణీత కాల వ్యవధిలో అప్డేట్ చేస్తూ ఉంటాయి. ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను అప్డేట్ చేస్తుంటాయి. ఈ విధంగా కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తుంటాయి.
కేవైసీ నిబంధనలకు అనుగుణంగా ఉన్న బ్యాంక్ ఖాతా కలిగిన వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే కొంతమంది కేవైసీ ఎక్స్పైరీ అయిపోయి ఉంటుంది. లేదంటే పెండింగ్‌లో ఉండొచ్చు. ఇలాంటి వారు కచ్చితంగా కేవైసీ పూర్తి చేసుకోవాలి. లేదంటే కొత్త ఏడాది నుంచి బ్యాంక్ అకౌంట్ పని చేయకపోవచ్చు.
కేవైసీ గురించి 2021 మే లో అన్ని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది. అయితే, కోవిడ్ 19 ప్రతికూల పరిస్థితుల్లో కేవైసీ అప్డేట్ గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించింది. దీంతో కేవైసీ ఎక్స్పైరీ అయిపోయిన వారికి ఊరట కలిగింది. అయితే ఈ నెల చివరితో ఆ ఆదేశాలకు గడువు తీరుతుంది. తర్వాత బ్యాంకులు కేవైసీ పూర్తి కాని అకౌంట్లను ఫ్రీజ్ చేయచ్చు.
కేవలం బ్యాంకులు మాత్రమే కాకుండా ఫైనాన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్, బ్రోకింగ్ హౌస్‌లు, డిపాజిటరీస్ వంటివి అన్నీ కేవైనీ రూల్స్‌ను అనుసరించాల్సిందే. యాంటీ మనీ ల్యాండరింగ్ చట్టాలకు అనుగుణంగా కస్టమర్ల కేవైసీని అప్డేట్ చేస్తుండాలి.
Gmail user ALERT : మీ ఆండ్రాయిడ్, ఐఫోన్ నుంచి Secret email ఇలా పంపుకోవచ్చు!
కేవైసీని పలు మార్గాల్లో పూర్తి చేయొచ్చు. వీడియో కేవైసీ, డిజి లాకర్ ద్వారా డాక్యుమెంట్ల షేరింగ్ లేదంటే నేరుగా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి కేవైసీ పూర్తి చేసుకోవడం వంటివి ఉన్నాయి. అదే సమయంలో అప్రమత్తత చాలా అవసరం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే కేవైసీ పేరుతో పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయి. సైబర్ క్రిమినల్స్ ఫిషింగ్ సైట్లు, లింకులు, మేసేజ్ లతో మోసాలకు పాల్పడుతున్నారు. కేవైసీ అప్ డేట్ పేరుతో మొబైల్ కు మేసేజ్ పంపి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. సో బీ కేర్ ఫుల్ అంటున్నారు నిపుణులు.