వలస కార్మికులకు కేంద్రం రూ.10వేలు ఇవ్వాలి: సీఎం

వలస కార్మికులు ఒకొక్కరికి రూ.10వేలు ఇవ్వాలని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంటున్నారు. కార్మికులకు ఒకసారి సహాయం కింద రూ.10వేలు ఇవ్వాలని.. కరోనా వైరస్ సంక్షోభంలో ఉన్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలని బుధవారం విజ్ఞప్తి చేశారు. ట్వీట్ ద్వారా అభిప్రాయం వ్యక్తి చేసిన ఆమె.. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక సంక్షోభంలో పడిపోయిన వారిని ఆదుకోవాలని కోరారు.
ప్రధానమంత్రి సహాయి నిధి, అత్యవసర సహాయ నిధి నుంచి సహాయం అందాలని కోరారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ‘ఊహాతీతమైన పరిస్థితుల్లో ప్రజలు ఇరుక్కుపోయారని.. కార్మికులకు చేయూత ఇవ్వాలని ఆమె ట్వీట్ ద్వారా అన్నారు. పీఎం కేర దీని కోసం ఉపయోగపడాలని కోరారు.
లాక్‌డౌన్ సమయంలో తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను కొన్ని దశాబ్దాలు వెనక్కునెట్టేశాయి. ఆర్థికంగా నిలదొక్కుకునే క్రమంలో ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ నియమాలను సడలించారు అధికారులు.
Read:భారత్ లో ట్రెండింగ్ యాప్…గూగుల్ ప్లే స్టోర్ నుంచి “”Remove China Apps”తొలగింపు