Bhagwant Mann : ఎంపీ పదవికి భగవంత్ మాన్ రాజీనామా
లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చింది. దీంతో 2022, మార్చి 14వ తేదీ సోమవారం ఢిల్లీకి రానున్నారు భగవంత్ మాన్. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రాజీనామా...

Punjab
Bhagwant Mann Leaves For Delhi : పంజాబ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఆప్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చకచకా జరుగుతున్నాయి. ఈయన 16న పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారనే సంగతి తెలిసిందే. తాను రాజ్ భవన్ లో ప్రమాణం చేయనని…భగవంత్ మాన్ ఖట్కర్ కలాన్‌లో చేస్తానని ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. సంగ్రూర్ జిల్లాలోని ధురి స్థానం నుంచి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 58 వేల 206 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.
Read More : Punjab AAP : కొడుకు ఎమ్మెల్యే.. తల్లి స్వీపర్, చీపురును వదలనంటోంది
ఈ క్రమంలో.. లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చింది. దీంతో 2022, మార్చి 14వ తేదీ సోమవారం ఢిల్లీకి రానున్నారు భగవంత్ మాన్. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రాజీనామా పత్రాన్ని అందచేయనున్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం, ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపద్యంలో ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు. మరోవైపు ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రివర్గం ఏర్పాటుపై పార్టీ కేంద్ర నాయకత్వంతో ఆయన చర్చలు జరుపనున్నారు. ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయించేందుకు మార్చి 16న శాసనసభ తొలి సెషన్‌ను నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.
Read More : AAP Punjab : అమృత్‌సర్‌లో ఆప్ విజయోత్సవ ర్యాలీ
పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందే భగవంత్‌మాన్ సింగ్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సహా 122 మంది మాజీ ఎమ్మెల్యేల భద్రతను తొలగించారు. అంతేకాదు.. తాను రాజ్ భవన్ లో కాకుండా…భగత్ సింగ్ గ్రామమైన ఖట్కర్ కలన్ లో సీఎంగా ప్రమాణం చేస్తానని ప్రకటించి అందరి దృష్టిని మరోసారి ఆకర్షించారు. కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫొటోలు ఉండవని, షహీద్ భగత్ సింగ్, బాబా సాహెబ్ అంబేద్కర్ ఫొటోలు ఉంటాయని వెల్లడించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా… పంజాబ్ రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆఫ్ విజయదుందుభి మ్రోగించింది. 117 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఆప్ ఏకంగా 92 సీట్లలో విజయం సాధించింది. చీపురు దెబ్బకు కాంగ్రెస్, బీజేపీతో సహా ఇతర పార్టీలు కొట్టుకపోయాయి.