Bharat Jodo Yartra: రాహుల్‌తో సెల్ఫీ కోసం.. పరుగులు పెట్టుకుంటూ వచ్చిన యువతులు.. నాల్గోరోజు ఉత్సాహంగా కొనసాగుతున్న పాదయాత్ర ..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర నాల్గో రోజు ఉత్సాహంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం 7గంటలకు తమిళనాడు రాష్ట్రంలోని ములగుమోడు నుంచి భారత్ జోడో పాదయాత్రను రాహుల్ గాంధీ పున: ప్రారంభించారు. యాత్ర ప్రారంభం నుంచి భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్రలో పాల్గొన్నారు.

Rahul Gandhi
Bharat Jodo Yartra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర నాల్గో రోజు ఉత్సాహంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం 7గంటలకు తమిళనాడు రాష్ట్రంలోని ములగుమోడు నుంచి భారత్ జోడో పాదయాత్రను రాహుల్ గాంధీ పున: ప్రారంభించారు. యాత్ర ప్రారంభం నుంచి భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్రలో పాల్గొన్నారు. రహదారిపొడవునా రాహుల్ యాత్రకు మద్దతు తెలుపుతూ స్థానిక ప్రజలు నినాదాలు చేశారు. స్థానికులతో కరచాలనం, అభివాదం చేసుకుంటూ రాహుల్ గాంధీ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు.
3rd Day Bharat Jodo Yatra: రాహుల్ గాంధీని కలిసిన ‘విలేజ్ కుకింగ్ ఛానెల్’ సభ్యులు
శనివారం నాల్గోరోజు పాదయాత్ర ఉదయం 10గంటలకు కన్యాకుమారిలోని మూర్తాండం వద్ద నెసమోని మెమోరియల్ క్రిస్టియన్ కళాశాల వద్దకు చేరుకుంటుంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. స్థానిక ప్రజలతో కొద్దిసేపు ముచ్చటిస్తారు. సాయంత్రం 4 గంటలకు యాత్ర పున: ప్రారంభం అవుతుంది. రాత్రి 7గంటలకు కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం జిల్లాలోని చెరువరకోణంలోని శ్యాముల్ ఎల్ఎంఎస్ హెచ్ఆర్ ఎస్ఈసీ స్కూల్ వద్దకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేరుకుంటుంది.
An adorable start to the day ?#BharatJodoYatra pic.twitter.com/pPIJpZ3rv1
— Bharat Jodo (@bharatjodo) September 10, 2022
శనివారం ఉదయం ప్రారంభమైన పాదయాత్రలో రాహుల్ కు మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీగా పాల్గొంటున్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో ముందుకు కదులుతున్న క్రమంలో.. రహదారిపక్కనే రాహుల్ రాకకోసం వేచియున్న చిన్నారులు, యువతులు.. రాహుల్ రాగానే ఒక్కసారిగా రాహుల్ వద్దకు పరుగులు పెడుతూ వెళ్లి సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. తొలుత ఓ చిన్నారి రాహుల్ వద్దకు.. సార్.. సార్ అంటూ పరుగుపెట్టుకుంటూ వెళ్లింది. ఆమెను చూసి రాహుల్ అక్కడే నిలుచుండిపోయాడు. ఆ చిన్నారిపక్కనే మరికొంత మంది యువతులు రాహుల్ చుట్టూచేరి సార్ సెల్ఫీ అంటూ.. రాహుల్ తో సెల్ఫీ దిగారు. రాహుల్‌సైతం ఓపిగ్గా వారితో సెల్ఫీలు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.