Bharat Jodo Yatra: 13వ రోజు కేరళలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర.. రాహుల్ పాదయాత్రలో భారీగా పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు
కాంగ్రెస్ పార్టీ నేత, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళ రాష్ట్రంలో ఉత్సాహంగా కొనసాగుతుంది. 13వ రోజు మంగళవారం ఉదయం 6.30గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది.

Rahul gandi Bharat jodo yatra
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ నేత, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళ రాష్ట్రంలో ఉత్సాహంగా కొనసాగుతుంది. 13వ రోజు మంగళవారం ఉదయం 6.30గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది. అంతకుముందు ఉదయం 6 గంటలకు శాస్త్రవేది-కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పర్యావరణ విభాగం నిర్వహించిన చెర్తలాలోని సెయింట్ మైఖేల్ కళాశాలలో రంబుటాన్ పండ్ల మొక్కను రాహుల్ నాటాడు. ఇది కేరళలో ఎక్కువగా తినే పండు.
Started day 13 of #BharatJodoYatra at 6am by planting a sapling of the Rambutan fruit tree at St. Michael's College, Cherthala organised by Sasthravedi—the environment wing of Kerala Pradesh Congress Committee. It is a fruit that is widely consumed in Kerala. pic.twitter.com/h1sJartNwr
— Jairam Ramesh (@Jairam_Ramesh) September 20, 2022
ఇదిలాఉంటే.. భారత్ జోడోయాత్ర 13వ రోజు ఉదయం 6:30 గంటలకు ప్రారంభమైంది. అలప్పుజా జిల్లాలోని చెర్తలా నుండి పాదయాత్ర ప్రారంభమైంది. 15 కి.మీ పాదయాత్ర సాగిన తరువాత కుతియాతోడుకు ఉదయం 11గంటలకు యాత్ర చేరుకుంటుంది. అక్కడ రాహుల్ విశ్రాంతి తీసుకుంటారు. కుంతియాతోడులోని ఎన్ఎస్ఎస్ బిల్డింగ్ లో పలు వర్గాల ప్రజలతో రాహుల్ సమావేశమవుతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. తిరిగిసాయంత్రం 4.30 గంటలకు పాదయాత్ర ఎర్మలోర్ జంక్షన్ వద్ద ప్రారంభమై రాత్రి 7గంటలకు అరూర్ జక్షన్ వద్దకు పాదయాత్ర చేరుకుంటుంది. రాత్రి ఎర్నాకులంలోని కొచ్చి యూనివర్శిటీలో రాహుల్ బస చేస్తారు.

bharat jodo yatra 13th day schedule
రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రలో పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. మంగళవారం ఉదయం పాయాత్రలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. వారికి అభివాదం చేసుకుంటూ రాహుల్ గాంధీ ముందుకు సాగారు. చిన్నారులు, పెద్దలు రాహులతో కరచాలనం చేసేందుకు పోటీపడుతున్నారు. పలు ప్రాంతాల్లో రాహుల్ గాంధీ రహదారి పక్కనఉన్న ప్రజల వద్ద ఆగి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరాతీశారు. ఇదిలాఉంటే సోమవారం 22 కిలో మీటర్లు యాత్ర సాగింది. 12రోజుల్లో రాహుల్ 255 కి.మీ పాదయాత్రలో పాల్గొన్నారు.