LK Advani : ఎల్‌కే అద్వానీని వరించిన భారతరత్న

ఎల్‌కె అద్వానీని భారత రత్న వరించింది. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా ప్రకటించారు ప్రధాని మోదీ. దేశానికి అద్వానీ చేసిన సేవలను కొనియాడుతూ ఆయనకు భారతరత్న రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

LK Advani : ఎల్‌కే అద్వానీని వరించిన భారతరత్న

LK Advani

Updated On : February 3, 2024 / 12:52 PM IST

LK Advani : బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీని భారత రత్న వరించింది. దేశానికి ఆయన చేసిన సేవలకు గాను భారతదేశ అత్యున్నత పురస్కారం లభించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ ద్వారా ప్రకటించారు.

Also Read: మోదీ, రాహుల్.. ఎన్డీయే, ఇండియా.. ఎవరి సత్తా ఎంతో తెలుసా?

బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ భారతరత్న పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రధాని మోదీ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. ‘అద్వానీ గొప్ప రాజనీతిజ్ఞుడని.. దేశాభివృద్ధిలో ఆయన సేవలు ఎనలేనివని కొనియాడిన మోదీ.. ఆయనకు భారతరత్న ఇవ్వనున్నట్లు పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని.. తాను ఆయనతో మాట్లాడానని.. ఈ గౌరవం లభించినందుకు అభినందనలు తెలిపానని’ మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Also Read: మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్ పై ప్ర‌ధాని మోదీ.. పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తికి మేలు చేసే బ‌డ్జెట్

అద్వానీ 1927 నవంబర్ 8న పాకిస్తాన్‌లోని కరాచీలో జన్మించారు. కిషన్ చంద్ అద్వానీ, జ్ఞానీదేవి తల్లిదండ్రులు. భార్య కమలా అద్వానీ (2016 లో కన్నుమూశారు). ఆయనకు ప్రతిభా అద్వానీ, జయంత్ అద్వానీ ఇద్దరు పిల్లలు. అద్వానీ రాజకీయ జీవితానికి వస్తే 1970 లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1977 లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖా మంత్రిగా పనిచేశారు. 1998 లో వాజపేయి ప్రభుత్వంలో హోంమంత్రిగా వ్యవహరించారు. 2002లో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. 2007 లో బీజేపీ ఆయనను ప్రధాని అభ్యర్ధిగా నిర్ణయించింది. 2008 లో ‘మై కంట్రీ.. మై లైఫ్’ పేరుతో తన బయోగ్రఫీని రాసారు. గతంలో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. అద్వానీకి భారతరత్న పురస్కారం రావడం పట్ల అభినందలు వెల్లువెత్తుతున్నాయి.