Bihar: బిహార్‌లో మళ్లీ కల్తీ మద్యం కలకలం.. ఇద్దరి మృతి.. కంటిచూపు కోల్పోయిన ముగ్గురు
కల్తీ మద్యంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్ని వెలుగులోకి వస్తున్నా పోలీసులు..

Spurious Liquor
Bihar – Muzaffarpur: సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న బిహార్‌లో మరోసారి కల్తీ మద్యం కలకలం రేపింది. ముజఫర్‌పూర్ జిల్లాలో కల్తీ మద్యం తాగి ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు కంటిచూపు కోల్పోయారు. ఈ ఏడాది ఏప్రిల్లో బిహార్ లోని మోతిహారీలో కల్తీ మద్యం తాగి 27 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
కల్తీ మద్యంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్ని వెలుగులోకి వస్తున్నా అధికారులు కల్తీ మద్యాన్ని అరికట్టలేకపోతున్నారు. పదే పదే కల్తీ మద్యం కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్న ఘటనలు చోటుచేసుకుంటుండడం గమనార్హం. ముజఫర్‌పూర్ జిల్లాలో ఇవాళ కల్తీ మద్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఇద్దరి పేర్లు ఉమేశ్ షా, ధర్మేంద్ర రామ్ అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని చెప్పారు.
కల్తీ మద్యం అమ్మిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని వివరించారు. మద్యం తాగాక కొందరు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తమకు సమాచారం రాగానే ఘటనాస్థలికి వెళ్లామని తెలిపారు. కాగా, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కల్తీ మద్యం వ్యాపారుల ఆగడాలకు ఫుల్ స్టాప్ పెట్టలేకపోతున్నారు.
Survey on Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలా? ప్రజలు ఏమంటున్నారు?