OBC Quota upto 75%: ఓబీసీ రిజర్వేషన్ 65% పెంపుకు బిహార్ అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్

మరోవైపు కుల గణన నివేదికపై ప్రశ్నలు సంధించిన వారిపై నితీశ్ కుమార్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ కొన్ని కులాలు పెరిగాయని, కొన్ని తగ్గాయని వస్తున్న వ్యాఖ్యల్ని ఆయన కొట్టిపారేశారు

OBC Quota upto 75%: ఓబీసీ రిజర్వేషన్ 65% పెంపుకు బిహార్ అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్

Updated On : November 7, 2023 / 8:23 PM IST

OBC Quota upto 75%: అత్యంత వెనుకబడిన వర్గాలకు (మోస్ట్ బ్యాక్ వర్డ్ క్యాస్ట్) 65 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చేసిన ప్రతిపాదనకు బిహార్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బిహార్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ ప్రతిపాదనను మంగళవారం అసెంబ్లీ ముందు ఉంచారు. అనంతరం జరిగిన ఓటింగులో దీనికి పూర్తి స్థాయి మద్దతు లభించింది. అలాగే 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తీసుకువచ్చిన కారణంగా, రిజర్వేషన్ మొత్తం కోటాను 75 శాతానికి పెంచాలని ఈ ప్రతిపాదన పెట్టే ముందు ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ కోటా పెంచాలని నితీశ్ డిమాండ్ అన్నారు.

మరోవైపు కుల గణన నివేదికపై ప్రశ్నలు సంధించిన వారిపై నితీశ్ కుమార్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ కొన్ని కులాలు పెరిగాయని, కొన్ని తగ్గాయని వస్తున్న వ్యాఖ్యల్ని ఆయన కొట్టిపారేశారు. ఇంతకు ముందు కుల ప్రాతిపదికన జనాభా గణన జరగనప్పుడు, కులాల సంఖ్య తగ్గిందని, పెరిగిందని ఎలా చెబుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఇదంతా బోగస్ ప్రచారమని, ఇలాంటివి చెప్పకూడదని నితీశ్ అన్నారు.