Bengal: బీజేపీ, లెఫ్టు చేతులు కలిపాయి.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
ఈరోజు రామ్ (బీజేపీ), బాం (లెఫ్ట్) ఒక్కటయ్యారు. మనల్ని ఓడించడానికి ఇద్దరూ చేతులు కలిపారు. నిజానికి వీరిద్దరివీ పూర్తి విరుద్ధ భావజాలాలు. అయినప్పటికీ మన మీద పోరాటానికి ఏకమయ్యారు. కానీ మనకు చాలా గొప్ప సైద్ధాంతికత ఉంది. మనం వారిని ఓడించాలి. దానికి మనమంతా కలిసికట్టుగా ఉండాలి. ప్రజల మధ్య మతం చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.

BJP, Left have joined hands says Mamata Banerjee
Bengal: భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీల భావజాలాలు వేరైనప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ)ని ఓడించడానికి ఆ రెండు పార్టీలు ఏకమయ్యాయని టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాజాగా రాష్ట్రంలని నజ్రుల్ మంచలో జరిగిన టీఎంసీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పంటను నాశనం చేయముందుకే కలుపు మొక్కలను తొలగించాలని, రాష్ట్రాన్ని కాపాడాలంటే వీరి (బీజేపీ, లెఫ్ట్)ని పూర్తిగా నిర్మూలించాలని ఆమె పిలుపునిచ్చారు.
Himachal Pradesh: తన మొదటి జీతాన్ని విద్యార్థులకు ఇవ్వనున్నట్లు ప్రకటించిన హిమాచల్ సీఎం
‘‘ఈరోజు రామ్ (బీజేపీ), బాం (లెఫ్ట్) ఒక్కటయ్యారు. మనల్ని ఓడించడానికి ఇద్దరూ చేతులు కలిపారు. నిజానికి వీరిద్దరివీ పూర్తి విరుద్ధ భావజాలాలు. అయినప్పటికీ మన మీద పోరాటానికి ఏకమయ్యారు. కానీ మనకు చాలా గొప్ప సైద్ధాంతికత ఉంది. మనం వారిని ఓడించాలి. దానికి మనమంతా కలిసికట్టుగా ఉండాలి. ప్రజల మధ్య మతం చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. కమ్యూనిస్టుల పాలనలో రాష్ట్రం ఎంత నష్టపోయిందో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రెండు పార్టీలు రాష్ట్రంలో పెరిగిన కలుపు మొక్కలు. పంట నష్టం కాకూడదంటే ఆ కలుపు మొక్కల్ని ఏరివేయాలి’’ అని కార్యకర్తల సమావేశంలో మమత అన్నారు.