2024 Elections: పార్లమెంట్ దాడిపై తొలిసారి స్పందించిన పాసులు ఇచ్చిన బీజేపీ ఎంపీ

దీనిపై ఆయన అభిప్రాయం ఏంటని చాలా రోజులుగా ఎదురుచూపుల మధ్య ఎట్టకేలకు ఆదివారం ప్రతాప్ సిన్హా తన మౌనాన్ని వీడారు. 2024 లోక్‌సభ ఎన్నికలలోగా తాను దేశభక్తుడినో, ద్రోహినో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు

2024 Elections: పార్లమెంట్ దాడిపై తొలిసారి స్పందించిన పాసులు ఇచ్చిన బీజేపీ ఎంపీ

పార్లమెంటు హౌస్‌లో లోక్‌సభ కార్యకలాపాల సమయంలో భద్రతను ఉల్లంఘించిన కేసులో భారతీయ జనతా పార్టీ లోక్‌సభ సభ్యుడు ప్రతాప్ సింహాపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కారణం.. భద్రతను ఉల్లంఘించిన వారికి ఆయన కార్యాలయం నుంచే పాసులు లభించడం. అయితే దీనిపై ఆయన అభిప్రాయం ఏంటని చాలా రోజులుగా ఎదురుచూపుల మధ్య ఎట్టకేలకు ఆదివారం ప్రతాప్ సిన్హా తన మౌనాన్ని వీడారు. 2024 లోక్‌సభ ఎన్నికలలోగా తాను దేశభక్తుడినో, ద్రోహినో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. ఈ ఘటనపై కొత్తగా తానేమీ చెప్పదల్చుకోలేదని అన్నారు. తనపై మోపిన ‘దేశద్రోహం’ ఆరోపణలు నిజమా కాదా అనేది దేవుడు, తన అభిమానులకు వదిలేయాలని సిన్హా అన్నారు.

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ డిసెంబర్ 13న లక్నో నివాసి సాగర్ శర్మ, మైసూర్ నివాసి డి.మనోరంజన్ బూట్లలో పొగ గొట్టాలు దాచుకుని పార్లమెంటులోకి ప్రవేశించారు. అనంతరం సభ్యుల బెంచీల మీదకు దూకి కలర్ గ్యాసులు ప్రయోగించారు. అదే సమయంలో పార్లమెంట్ వెలుపల కూడా ఇలాంటిదే జరిగింది. నీలం వర్మ, అమోల్ షిండేలు కలర్ గ్యాసులను వెలిగించారు. ఇది రాజకీయ వివాదానికి దారితీసింది. శీతాకాల సమావేశాల్లో 143 మంది ప్రతిపక్ష ఎంపీల సస్పెన్సణ్ కు కారణమైంది.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీలో అనేక మార్పులు.. లోక్‮‭సభ ఎన్నికలపై ఇస్తున్న సంకేతాలు ఏంటి?

ఇక ఈ వివాదం, తనపై వస్తున్న విమర్శలపై సిన్హా స్పందిస్తూ.. ‘‘నేను అన్నింటినీ భగవంతుడికి నా అభిమానులకు వదిలివేస్తున్నాను. నాపై అభియోగాలు మోపారు. నన్ను దేశద్రోహి అంటున్నారు. ఆ ఆరోపణలు నిజమో కాదో ప్రజలే నిర్ణయిస్తారు’’ అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ప్రతాప్‌ సిన్హా దేశద్రోహినా, దేశభక్తుడా అనేది మైసూరు కొండలపై కూర్చున్న మాత చాముండేశ్వరి, బ్రహ్మగిరిపై కూర్చున్న కావేరీ మాత నిర్ణయిస్తారు. గత 20 ఏళ్లుగా నేను రాసిన పుస్తకాలను చదువుతున్న కర్ణాటకలోని నా అభిమానులు, గత తొమ్మిదిన్నరేళ్లుగా నా కృషిని చూస్తున్న మైసూరు, కొడగు ప్రజలు నిర్ణయిస్తారు. దేశం, మతం, జాతీయవాదానికి సంబంధించిన సమస్యలపై నా ప్రవర్తన ఏప్రిల్ 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలలో పోలైన ఓట్ల ద్వారా నిర్ణయించబడుతుంది’’ అని అన్నారు.