Haryana Elections 2024: గుర్రంపై వెళ్లి ఓటు వేసిన బీజేపీ నేత.. ఎందుకంటే?

నయాబ్ సింగ్ సైనీ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని అనుకుంటున్నానని అన్నారు.

Haryana Elections 2024: గుర్రంపై వెళ్లి ఓటు వేసిన బీజేపీ నేత.. ఎందుకంటే?

Updated On : October 5, 2024 / 4:45 PM IST

హరియాణా అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ ఇవాళ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి గుర్రంపై వెళ్లారు. ఓటువేసి, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుర్రంపై రావడాన్ని శుభపరిణామంగా భావించి, దానిపైనే ఇక్కడికి వచ్చానని తెలిపారు.

హరియాణా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ గురించి మాట్లాడుతూ… బీజేపీకి ప్రజల ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పారు. నయాబ్ సింగ్ సైనీ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని అనుకుంటున్నానని అన్నారు. అయితే, అనిల్ విజ్ కూడా తమ పార్టీకి చాలా గొప్ప నాయకుడని ఎవరు ముఖ్యమంత్రి అవుతారో కాలమే చెబుతుందని తెలిపారు.

పెద్ద నాయకుడి మనస్సులో ఏదైనా ఉంటే ఆ మాటను చెప్పే హక్కు అతనికి ఉంటుందని నవీన్ జిందాల్ అన్నారు. హిస్సార్‌ నుంచి పోటీ చేస్తున్న తన తల్లి సావిత్రి జిందాల్‌ హిస్సార్‌ తన నియోజక వర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నారని తెలిపారు. హిస్సార్‌కి ఎవరు ప్రాతినిధ్యం వహించాలో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.

దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు.. ఎందుకో తెలుసా..