దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు.. ఎందుకో తెలుసా..

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన ఆరోపణలపై నిందితులను ప్రశ్నిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు.

దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు.. ఎందుకో తెలుసా..

NIA Raids (Photo Credit : Google)

Updated On : October 5, 2024 / 4:46 PM IST

NIA Raids : దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. 5 రాష్ట్రాల్లోని 22 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో ఈ తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జమ్ముకశ్మీర్, మహారాష్ట్ర సహా మొత్తం 5 రాష్ట్రాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని జాల్నా జిల్లాలో ఇద్దరిని, ఛత్రపతి శంబాజీనగర్ జిల్లాలో ఒకరిని, మాలేగావ్ లో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన ఆరోపణలపై నిందితులను ప్రశ్నిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు.

Also Read : ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య 30ఏళ్ల స్నేహం ఎందుకు చెడింది? ఈ స్థాయిలో శత్రుత్వానికి కారణమేంటి?

జైషే ఉగ్రవాద సంస్థకు నిధులు సమకూర్చారన్న అంశానికి దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో 22 ప్రాంతాల్లో జాతీయ దర్యాఫ్తు సంస్థ(ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది. జమ్ముకశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, అస్సాం రాష్ట్రాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో ఈ దాడులు చేసింది ఎన్ఐఏ. జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గించేందుకు కేంద్రం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఉగ్రవాదులకు ఎక్కడెక్కడి నుంచి నిధులు సమకూరుతున్నాయి అన్న కోణంలో భాగంగా ఎన్ఐఏ గత కొన్నేళ్లుగా దర్యాఫ్తు జరుపుతోంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ 5 రాష్ట్రాల్లో సోదాలు జరుగుతున్నాయి. అరెస్ట్ చేసిన వారి నుంచి సమగ్ర సమాచారం సేకరిస్తోంది ఎన్ఐఏ. దేశవ్యాప్తంగా సోదాలు, పలువురి అరెస్ట్ పై ఎన్ఐఏ ఒక ప్రకటన విడుదల చేసే ఛాన్స్ ఉంది.

ఎన్ఐఏ, యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ సంయుక్తంగా ఈ రైడ్స్ చేసినట్లు సమాచారం. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద కుట్రలు, ఉగ్రవాదులకు ఫండింగ్ అణిచివేత లక్ష్యంగా సోదాలు జరుపుతోంది ఎన్ఐఏ. అధికారులు అదుపులోకి తీసుకున్న వ్యక్తులు.. జమ్మకశ్మీర్‌లో పని చేస్తున్న ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగున్నారని, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

ప్రాథమిక నివేదికల ప్రకారం, అదుపులోకి తీసుకున్న నిందితులు టెర్రర్ ఫైనాన్సింగ్, టెర్రరిస్ట్ సపోర్ట్ గ్రూపులతో ఉన్న సంబంధాల కోసం కూడా దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకుని విస్తృత ఆపరేషన్‌లో భాగంగా ఈ దాడులు జరిగాయి. పూర్తి స్థాయిలో సోదాలు, డాక్యుమెంటేషన్ తర్వాత అధికారులు దీనిపై ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.

కొన్ని రోజుల క్రితం (అక్టోబర్ 1న) మావోయిస్టు పునరుజ్జీవన కుట్రకు సంబంధించి పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ పలు దాడులు నిర్వహించింది. అటు తమిళనాడులోనూ ఇదే తరహా ఉగ్రవాద కుట్రలకు సంబంధించి చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఇదే తరహా ఆపరేషన్ నిర్వహించింది. అనంతరం ఆ కేసును NIAకి బదిలీ చేసింది.