మమత బయోపిక్ పై ఈసీకి బీజేపీ లేఖ

  • Published By: venkaiahnaidu ,Published On : April 17, 2019 / 01:58 PM IST
మమత బయోపిక్ పై ఈసీకి బీజేపీ లేఖ

Updated On : April 17, 2019 / 1:58 PM IST

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బయోపిక్ విడుదలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం, వెస్ట్ బెంగాల్ సీఈవోకి లేఖ రాసింది.బెంగాల్ ఆడ టైగర్ క్యాప్షన్ తో భాగిని పేరుతో తెరకెక్కిన మమతా బెనర్జీ బయోపిక్ మే-3,2019న విడుదల కానుంది.అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు సినిమా విడుదలకు ముందే దాన్ని సమీక్షించాల్సిందిగా ఈసీని కోరారు. నరేంద్రమోడీ బయోపిక్ విడుదల విషయంలో సీఈసీ పాటించిన మార్గదర్శకాలనే ఈ సినిమా విషయంలో కూడా అనుసరిస్తారని ఆశిస్తున్నట్లు బీజేపీ తెలిపింది.