నోట్ల కట్టలను కిటికీలో నుంచి విసిరేసిన చీఫ్ ఇంజినీర్.. వర్షంలా కిందపడ్డ నోట్లు.. ఎంత కష్టపడి లెక్కపెట్టారో చూడండి..

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి.

నోట్ల కట్టలను కిటికీలో నుంచి విసిరేసిన చీఫ్ ఇంజినీర్.. వర్షంలా కిందపడ్డ నోట్లు.. ఎంత కష్టపడి లెక్కపెట్టారో చూడండి..

Updated On : May 31, 2025 / 11:23 AM IST

ఒడిశాకు చెందిన చీఫ్ ఇంజినీర్ వైకుంఠనాథ్ సారంగి తన ఇంటిపై విజిలెన్స్‌ అధికారులు రైడ్‌ చేయడానికి వస్తున్నారని గమనించి షాక్ అయ్యారు. ఇంట్లో దాచిన బ్లాక్ మనీ మొత్తాన్ని కిటికీలో నుంచి బయటకు విసిరేశారు. 500 రూపాయల నోట్ల కట్టలను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు.

నోట్ల వర్షంలా అవి కింద పడటం చూసిన విజిలెన్స్‌ అధికారులు ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. వైకుంఠనాథ్ సారంగి గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్ ఇంజినీర్. ఆయన భువనేశ్వర్‌కు చెందినవారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి.

Also Read: గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటన.. బాధిత కుటుంబ సభ్యుల ఆరోపణలకు ఫైర్ డిపార్ట్మెంట్ కౌంటర్

అధికారులు ప్రత్యక్ష సాక్షుల సమక్షంలో డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు చెందిన మొత్తం 7 చోట్ల విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మొత్తం రూ.2.1 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో రూ.1.1 కోట్లు ఆయనకు చెందిన అంగుల్ జిల్లాలోని ఇంట్లో, మరో రూ.1 కోటి భువనేశ్వర్‌లోని ఫ్లాట్‌లో దొరికాయి. ఈ తనిఖీల్లో మొత్తం 26 మంది అధికారులు పాల్గొన్నారు.