బోఫోర్స్ తో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది, రఫెల్ తో మోడీ అధికారంలోకి వస్తారు

బోఫోర్స్ కుంభకోణం...రఫేల్ దేశ రక్షణ...మోడీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తుంది

  • Published By: chvmurthy ,Published On : January 4, 2019 / 01:26 PM IST
బోఫోర్స్ తో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది, రఫెల్ తో మోడీ అధికారంలోకి వస్తారు

బోఫోర్స్ కుంభకోణం…రఫేల్ దేశ రక్షణ…మోడీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తుంది

ఢిల్లీ: దేశాన్ని కుదిపి పారేస్తున్న రఫేల యుధ్ద విమానాల కోనుగోలు అంశంపై లోక్ సభలో శుక్రవారం వాడివేడి చర్చ జరిగింది. అధికార, విపక్షాల మధ్య మాటల యుధ్దం నడిచింది. ఒకానొకదశలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, రక్షణమంత్రి నిర్మలాసీతారామన్ మధ్య వాగ్యుధ్దం నడిచింది. రక్షణ మంత్రినిర్మలా సీతారామన్ దాదాపు 2 గంటలపాటు  విపక్షాల ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇచ్చారు.
రఫెల్ విమానాల ధరలను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతోందని, అనిల్అంబానీ కంపెనీకి ఆఫ్ సెట్ పార్టనర్ షిప్ ఇచ్చేలా నిబంధనలు ఎవరు మార్చారని రాహుల్ ప్రశ్నించారు. రఫేల్ డీల్ తో  ప్రధానిమోడీ పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశభద్రత దృష్ట్యా విమానాల ధరలను చెప్పలేమని  వివరణ ఇస్తూ రక్షణమంత్రి, యూపీఏ హాయంలో జరిగిన ఒప్పందంలో అనేక లోపాలున్నాయని,డిపెన్స్ కొనుగోలులో కాంగ్రెస్ వన్నీ దురుద్దేశాలే అని అన్నారు. మేము చెప్పే విషయాలు వినటానికి కూడా కాంగ్రెస్ పార్టీకి సహనం లేదని, ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలెండ్ భేటీపై రాహుల్ తప్పుడు సమాచారమిచ్చారని ఆమె అన్నారు. బోఫోర్స్ కుంభకోణంతో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిందని,  దేశప్రయోజనాల కోసం చేసుకున్న రఫేల్ ఒప్పందంతో మోడీ తిరిగి అధికారంలోకి వస్తారని ఆమె ధీమాగా చెప్పారు.