ఆజాద్ ఆప్తమిత్రుడు : మమత కుర్తాలు పంపిస్తారు : అక్షయ్ తో మోడీ చిట్ చాట్

  • Published By: madhu ,Published On : April 24, 2019 / 05:14 AM IST
ఆజాద్ ఆప్తమిత్రుడు : మమత కుర్తాలు పంపిస్తారు : అక్షయ్ తో మోడీ చిట్ చాట్

Updated On : April 24, 2019 / 5:14 AM IST

మోడీ అన్నా.. ఆయన విధానాలంటే విమర్శలు చేసే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ..భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కుర్తాలు పంపిస్తారంట…అవును ఈ విషయం స్వయంగా మోడీయే వెల్లడించారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌..మోడీని ఇంటర్వ్యూ చేశారు.

రాజకీయాలపై సంబంధం లేని అంశాలపై ఇంటర్వ్యూ జరిగింది. ఈ సందర్భంగా మోడీ ఎన్నో ఆసక్తికర కామెంట్స్ చేశారు. మమత ప్రతి సంవత్సరం కుర్తాలు పంపించడమే కాకుండా అప్పుడప్పుడు బెంగాలీ మిఠాయి కూడా పంపుతుంటారని తెలిపారు. 
Also Read : ఆ మాటకు నవ్వు ఆపుకోలేకపోయిన మోడీ,అక్షయ్

ప్రతిపక్ష నేతల్లో చాలా మంది తనకు ఫ్రెండ్స్ అని తెలిపిన మోడీ.. కాంగ్రెస్‌ నేత ఆజాద్‌ తనకు ఆప్తమిత్రుడన్నారు. తాను అందరితో సరదాగా గడపాలని భావిస్తానని, అధికారులతో ఫ్రెండ్లీగా ఉంటానన్నారు. తాను పని చేస్తా..అందరితో పనిచేయిస్తానని మోడీ వెల్లడించారు. కఠినంగా ఉంటాను కానీ.. ఎవరినీ అవమానించనన్నారు. ఎమ్మెల్యే అయ్యే వరకు తనకు బ్యాంకు ఖాతా లేదని చెప్పుకొచ్చారు. ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడూ వెళ్లి అమ్మను కలిసి వస్తానని మోడీ తెలిపారు.
Also Read : బంధాలు,అనుబంధాలు లేవు…అందుకే అమ్మతో ఉండటం లేదు