BRICS Summit 2024: బ్రిక్స్ సదస్సుకోసం రష్యా వెళ్లిన ప్రధాని మోదీ.. ఆసక్తికర ట్వీట్

మోదీ రష్యా పర్యటనకు బయలుదేరే ముందు ట్విటర్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ...

BRICS Summit 2024: బ్రిక్స్ సదస్సుకోసం రష్యా వెళ్లిన ప్రధాని మోదీ.. ఆసక్తికర ట్వీట్

PM Modi

Updated On : October 22, 2024 / 12:14 PM IST

PM Modi Russia Tour: రష్యాలోని కజాన్ వేదికగా 16వ బ్రిక్స్ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం 7.40గంటలకు భారత్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ బయలుదేరారు. మధ్యాహ్నం 1గంటల సమయంలో రష్యాకు చేరుకోనున్నారు. రష్యాలో మోదీ పర్యటన రెండు రోజులు సాగనుంది. మోదీకి స్వాగతం పలికేందుకు అక్కడి భారతీయులు భారీ ఏర్పాట్లు చేశారు. బ్రిక్స్ సదస్సులో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తోనూ ప్రధాని మోదీ భేటీ కానున్నారు. అయితే, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తోనూ మోదీ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Also Read: ఆ తేదీల్లో ఆ విమానాల్లో ప్రయాణించొద్దు..! ప్రయాణికులకు ఖలిస్తానీ వేర్పాటువాది వార్నింగ్..

మోదీ రష్యా పర్యటనకు బయలుదేరే ముందు ట్విటర్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు నేను బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యాలోని కజాన్ కు వెళ్తున్నాను. బ్రిక్స్ కు భారతదేశం చాలా ప్రాముఖ్యతనిస్తుంది. అక్కడ నేక అంశాలపై విస్తృత చర్చలకోసం, సదస్సులో పాల్గొనే వివిధ దేశాల నాయకులను కలవడానికి నేను ఎదురు చూస్తున్నాను అని మోదీ పేర్కొన్నారు. గ్లోబల్ డెవలప్ మెంట్ ఎజెండా, మెరుగైన బహుపాక్షికత, వాతావరణ మార్పు, ఆర్థిక సహకారం, సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలను ప్రోత్సహించడానికి బ్రిక్స్ లో సన్నిహిత సహకారాన్ని భారతదేశం విలువైనదిగా భావిస్తుందని మోదీ అన్నారు.