Rudraprayag Bridge collapse : భారీవర్షాలు..కూలిపోయిన రుద్రప్రయాగ్ వంతెన

ఉత్తరాఖండ్‌లో బుధవారం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రుద్రప్రయాగ్‌లో వంతెన కూలిపోయింది. బంటోలి వద్ద వంతెన కూలిపోవడంతో పలువురు ప్రయాణికులు చిక్కుకుపోయారు. దీంతో కేదార్‌నాథ్-మధ్మహేశ్వర్ మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది....

Rudraprayag Bridge collapse :  భారీవర్షాలు..కూలిపోయిన రుద్రప్రయాగ్ వంతెన

Rudraprayag Bridge collapse

Bridge collapse : ఉత్తరాఖండ్‌లో బుధవారం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రుద్రప్రయాగ్‌లో వంతెన కూలిపోయింది. బంటోలి వద్ద వంతెన కూలిపోవడంతో పలువురు ప్రయాణికులు చిక్కుకుపోయారు. దీంతో కేదార్‌నాథ్-మధ్మహేశ్వర్ మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొంతమంది ప్రయాణికులను తాళ్లతో రక్షించారు. (Bridge collapse) ఈ వారం హిల్-స్టేట్‌లో కుండపోత వర్షాల కారణంగా కనీసం ముగ్గురు మరణించారు. మరో 10 మంది తప్పిపోయారు. రుద్రప్రయాగ్ జిల్లాలోని బంటోలి వంతెన వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. (rains lash Uttarakhand) పుణ్యక్షేత్రాలను కలుపుతూ మధు గంగా నదిపై నిర్మించిన కాలిబాట వంతెన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా దెబ్బతింది.

Yamuna River : ఢిల్లీలో మళ్లీ డేంజర్ మార్కుకు చేరిన యమునా నది

కేదార్‌నాథ్ తీర్థయాత్రకు వెళ్లిన దాదాపు 200 మంది ప్రయాణికులు కూడా అక్కడికక్కడే చిక్కుకుపోయారు. వీరిలో కొందరు గల్లంతయ్యారు. బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి పుణ్యక్షేత్రాలకు వెళ్లే జాతీయ రహదారులు దెబ్బతిన్నాయి. భవనాలు, కొండచరియలు కూలిపోవడంతో భారీవర్షం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. కేదార్‌నాథ్ ట్రెక్ మార్గంలో లించోలి వద్ద శిబిరంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నాలుగు దుకాణాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో నేపాల్‌కు చెందిన ఒకరు మృతి చెందగా, మరో వ్యాపారి అదృశ్యమయ్యారని అధికారులు తెలిపారు.

Rishi Sunak : కేంబ్రిడ్జ్‌లో రామ్ కథకు హాజరైన బ్రిటీష్ ప్రధాని రిషి సునక్

26 ఏళ్ల కాలు బహదూర్ మృతదేహం లభ్యమైంది. కేదార్‌నాథ్-మద్మహేశ్వర్ తీర్థయాత్ర మార్గంలో కూడా అంతరాయం ఏర్పడి జనజీవనం స్తంభించింది. దీంతో రెండు రోజుల పాటు చార్ధామ్ యాత్రను నిలిపివేశారు. ఎడతెగని వర్షాలు,కొండచరియలు విరిగిపడటంతో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో 66 మంది మరణించారు. అత్యధిక మరణాలు హిమాచల్ ప్రదేశ్‌లో సంభవించాయని, ఆగస్టు 13 న భారీ వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి 60 మంది మరణించారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తెలిపారు.

Vrindavan : బృందావన్ ఆలయ సమీపంలో భవనం కూలి ఐదుగురి మృతి

మరో నాలుగు రోజుల్లో ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు. సిమ్లాలో కూలిన శివాలయం శిథిలాల నుండి ఒక మృతదేహాన్ని బయటకు తీయగా, నగరంలో తాజాగా కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు మరణించారు. సిమ్లా, జోషిమఠ్ లలో పలు ఇళ్లు వరదల వల్ల కూలిపోయాయి.