Bus caught fire : కర్నూల్ ఘటన తరహాలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దం.. పలువురు మృతి

Bus caught fire : రాజస్థాన్ రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దమైంది. జూపూర్ - ఢిల్లీ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.

Bus caught fire : కర్నూల్ ఘటన తరహాలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దం.. పలువురు మృతి

Bus Fire

Updated On : October 28, 2025 / 12:39 PM IST

Bus caught fire : కర్నూల్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దమై 19మంది ప్రయాణికులు మరణించిన ఘటన మరువకముందే మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దమైంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మరణించగా.. మరికొందరు గాయపడ్డారు.

రాజస్థాన్ రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దమైంది. జూపూర్ – ఢిల్లీ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ బస్సు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాజస్థాన్‌లోని మనోహర్‌పూర్ ప్రాంతంలోని తోడిలోని ఇటుక బట్టీకి కార్మికులను తీసుకెళ్తోంది. జైపూర్ గ్రామీణ జిల్లా షాపురా సబ్ డివిజన్‌లోని మనోహర్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతం వద్దకు‌రాగానే బస్సుకు హై‌టెన్షన్ విద్యుత్ వైర్లు తాకాయి. దీంతో భారీ శబ్దాలతోపాటు బస్సుకు మంటలు వ్యాపించాయి. మంటలు ఒక్కసారిగా బస్సు మొత్తం వ్యాపించడంతో బస్సు దగ్దమైంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 12మందికి గాయాలయ్యాయి.

ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని మెరుగైన చికిత్స కోసం జైపూర్ ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.