మహారాష్ట్ర అసెంబ్లీ రద్దు: మోడీతో వెళ్లేందుకేనా?

  • Published By: vamsi ,Published On : March 7, 2019 / 11:39 AM IST
మహారాష్ట్ర అసెంబ్లీ రద్దు: మోడీతో వెళ్లేందుకేనా?

Updated On : March 7, 2019 / 11:39 AM IST

మహారాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే యోచనలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు  వెళ్లాలని దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం యోచిస్తుంది. ఈ క్రమంలో 6నెలల ముందుగానే ఎన్నికల సమరంలో నిలచి గెలవాలని బీజేపీ భావిస్తుంది. 2014 అక్టోబర్‌లో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఏర్పడగా.. ఇంకా రాష్ట్ర అసెంబ్లీకి ఆరు నెలల సమయం ఉంది.
Also Read : ఈ లోకంలో లేడు : PubG ఆడుతూ.. నీళ్లకు బదులు యాసిడ్ తాగాడు

దేశవ్యాప్తంగా పుల్వామా దాడుల తర్వాత ఆ బీజేపీకి అనుకూల పవనాలు వీయడం.. అలాగే మిత్రపక్షం అయిన శివసేన కూడా ఇటీవల బీజేపీతో మళ్లీ కలవడం వంటి పరిణామాలు కలిసి వస్తాయని బీజేపీ భావిస్తుంది. మోడీతో పాటే ఎన్నికలకు వెళ్తే మోడీ మైలేజ్ పార్టీకి ఉపయోగపడే అవకాశం ఉంది అని అక్కడి ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నట్లు చెబుతున్నారు.

అలాగే లోక్‌సభ ఎన్నకలు దగ్గరకు వచ్చిన తరుణంలో ఇప్పడు అసెంబ్లీని రద్దు చేసుకుంటే పార్లమెంటుతో పాటే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని, అప్పుడు ఎన్నికలు రెండుసార్లు వచ్చే పరిస్థితి కూడా ఉండదని భావిస్తున్నది. దీనిపై ఇప్పటికే మిత్రపక్షాలతో మాట్లాడిన బీజేపీ దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని అధిష్టానంకు లేఖ రాసినట్లు  చెబుతున్నారు. బీజేపీ కేంద్ర కమిటీ ఆమోదం అనంతరం అసెంబ్లీని రద్దు చేయవచ్చు. సార్వత్రిక ఎన్నికలు ఈసారి పోటాపోటీగా జరిగే అవకాశం ఉండగా అప్పుడే ప్రభుత్వం నిర్ణయాంచుకోవచ్చని బీజేపీ నిర్ణయం తీసుకుంది.  
Also Read : ఫస్ట్ టైం : రూ.20 కాయిన్ వచ్చేస్తోంది