ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్…కేంద్ర కేబినెట్ ఆమోదం

Bonus For Central Employees కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. 2019-2020ఏడాదికి గాను నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు.. ప్రొడక్టివిట్ లింక్డ్ బోనస్(PLB),నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ ఇచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేంద్రకేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి ప్రకాష్ జావదేకర్ తెలిపారు.
డిఫెన్స్,పోస్ట్స్,ESIC,EPFO,రైల్వే వంటి కమర్షియల్ సంస్థల్లోని 16.97లక్షల నాన్ గెజిటెడ్ ఉద్యోగులు PLB లబ్ధి పొందనున్నారు. 13.70లక్షల మంది నాన్-గెజిటెడ్ కేంద్రప్రభుత్వ ఉద్యోగులు నాన్-PLB లబ్ధి పొందనున్నారు.
మొత్తంగా 30లక్షల మందికి పైగా నాన్ గెజిటెడ్ ఉద్యోగులు దీని ద్వారా లబ్ధి పొందనున్నారు. విజయదశమి(దసరా)కి ముందే డైరెక్ట్ బెన్ ఫిట్ ట్రాన్స్ ఫర్ ద్వారా ఒక్క విడతలోనే ఉద్యోగులకు బోసన్ ఇవ్వనున్నట్లు జావదేకర్ తెలిపారు. ఇందకుగాను, రూ.3,737కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్రమంత్రి ప్రకాష్ జావదేకర్ తెలిపారు.