18ఏళ్ల తర్వాత…ITBP క్యాడర్ రివ్యూకి కేబినెట్ ఆమోదం

  • Published By: venkaiahnaidu ,Published On : October 23, 2019 / 03:42 PM IST
18ఏళ్ల తర్వాత…ITBP క్యాడర్ రివ్యూకి కేబినెట్ ఆమోదం

Updated On : October 23, 2019 / 3:42 PM IST

ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్ (ITBP) క్యాడర్ రివ్యూ చేసేందుకు ఇవాళ(అక్టోబర్-23,2019)సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 18ఏళ్లుగా క్యాడర్ రివ్యూ పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. 2001లో చివరిసారిగా క్యాడర్ రివ్యూ జరిగింది. చైనాతో వాస్తవాధీన రేఖ వెంబడి విధులు నిర్వర్తించే ఐటీబీపీ బలం అప్పుడు 32వేలమంది కాగా,ఇప్పుడు 90వేల మంది ఉన్నారు.

క్యాడర్ రివ్యూ ద్వారా కొత్త పోస్టులు సృష్టించబడనున్నాయి. కొత్తగా గ్రూప్-ఏ జనరల్ డ్యూటీ (ఎగ్జిక్యూటివ్), నాన్ జనరల్ డ్యూటీ అధికారుల పోస్టులకు సంబంధించి 3వేల పోస్టులు సృష్టించనున్నట్లు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. వీటిలో 60 టాప్ కమాండ్ స్థాయి పోస్టులున్నట్లు తెలిపారు.