యూపీ కేబినెట్ : పోలీస్ స్టేషన్లలో ఆవులను కట్టేయండి..

ఉత్తరప్రదేశ్ : ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ ఆదేశాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. విపక్షాల విమర్శలకు తావిస్తున్నాయ్. తాజాగా ఆవుల సంరక్షణ కోసమంటూ గో కల్యాణ్ పేరిటసెస్ విధింపు ఇందుకు కారణంగా మారింది.
ఉత్తర ప్రదేశ్‌లో ఆవుల సంరక్షణ కోసం కొత్తగా సెస్‌ను విధించనున్నారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆవుల సంరక్షణకు పట్టణ, గ్రామీణ పౌర సంస్థల ఆధ్వర్యంలో తాత్కాలికంగా గోవంశ్ ఆశ్రయ్ ఆస్థల్ లను ఏర్పాటు చేసే ప్రతిపాదనలను కూడా మంత్రివర్గం ఆమోదించింది. దీనికి అనుగుణంగా..రాష్ట్రవ్యాప్తంగా ఆవుల సంరక్షణ కోసం తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు కానున్నాయ్. ఓ వేళ ఆవులకు సరిపడా షెడ్లు లేకున్నా..దొరకకపోతే..పోలీస్ స్టేషన్లలో ఆవులను కట్టేయాల్సిందిగా కేబినెట్ ఆదేశించడం నవ్వులపాలు అవుతోంది.
అసలు ఇలా షెడ్లు..తొలగించినందువల్లనే..గత వారంలో రైతులు పశువులు తమ పంటని నాశనం చేస్తున్నాయంటూ విపరీత చర్యలకు దిగారు. ఆవులను కనిపించిన స్కూల్స్, హాస్పిటల్స్ లలో కట్టేశారు. ఆక్రమణలను తొలగించే పనుల్లో భాగంగా..గోశాలల షెడ్లు తొలగించడంతో వాటికి నీడ లేకుండా పోయి..పొలాలపై దాడి చేసేవి..ఇప్పుడు మళ్లీ యూపి సర్కారు గోశాలల కోసం గో కల్యాణ్ సెస్ విధించడం గమనార్హం.
మరోవైపు అదనపు సెస్‌తో మందుబాబులకు కొత్త చిక్కులు వచ్చాయ్. గో సెస్ తో లిక్కర్ రేట్లూ పెరుగుతున్నాయ్. మద్యంతోపాటు టోల్ ట్యాక్స్ పై కూడా సెస్ విధించడం జరిగింది. 2శాతం సెస్ విధింపు నిర్ణయం ప్రజల్లో వ్యతిరేకత తెచ్చేదే అవుతుందని కొంతమంది అంచనా.