అసోం,బెంగాల్ లో ముగిసిన రెండో దశ ఎన్నికల ప్రచారం
అసోం,పశ్చిమ బెంగాల్ లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచార పర్వం ముగిసింది.

Campaigning For 2nd Phase Of Assembly Elections In West Bengal Assam End Today
Campaigning end అసోం,పశ్చిమ బెంగాల్ లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచార పర్వం ముగిసింది. ఏప్రిల్-1,2021న బెంగాల్లో 30, అసోంలో 39 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్ జరగనుంది.
రెండో దశలో భాగంగా బెంగాల్లోని దక్షిణ 24 పరగణాలు, బంకురా, పూర్వ మెద్నీపూర్ జిల్లాల్లోని నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు రెండో దశలోని నియోజకవర్గాలే కీలకం కానున్నాయి. సీఎం మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి పోటీ చేస్తున్న నందిగ్రామ్పైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు పార్టీలు హోరాహోరీగా ప్రచారం సాగించాయి. ఈ స్థానానికి రెండో దశలో భాగంగా గురువారం పోలింగ్ జరగనుంది.