నన్నే ఆపుతావా : టోల్ ప్లాజా ఉద్యోగిని 6 కిమీ లాక్కెళ్లాడు

నా కారును పోలీసులే ఆపరు..నువ్వు ఆపుతావు రా..అంటూ ఓ డ్రైవర్ టోల్ ప్లాజా ఉద్యోగిని ఢీ కొట్టి..బోనెట్‌పై ఎక్కిన వ్యక్తిని 6 కిలోమీటర్లు లాక్కెళ్లాడు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. టోల్ ప్లాజా వద్ద పైసలు కట్టాలని అడుగుతున్న వారిపై దౌర్జన్యాలకు తెగబడుతున్నారు కొంతమంది. దాడి చేయడమో..లేక వారిపై దౌర్జన్యం చేయడం వంటివి చేస్తున్నారు.
హర్యానాలోని గుర్ గ్రామ్ నగర రహదారిపై టోల్ ప్లాజా ఉంది. ఏప్రిల్ 13వ తేదీ శనివారం టోల్ ప్లాజా వద్దకు ఇన్నోవా కారు వచ్చింది. ఫీజు కట్టాలని ఉద్యోగి అశోక్ కుమార్ అడిగాడు. పోలీసులే నా కారును ఆపరు..నవ్వు ఆపుతావా అంటూ తిట్లు అందుకున్నాడు. కారును ముందుకు పోనిచ్చే ప్రయత్నం చేశాడు. బయటకు వచ్చిన ఉద్యోగి కారు ముందు నిల్చొని ఆపే ప్రయత్నం చేశాడు. ఆగ్రహానికి గురైన డ్రైవర్ కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు. ఉద్యోగి బొనైట్‌ను పట్టుకుని వేలాడాడు. వంద కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తూ..ఆరు కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.