Rakesh Tikait Warns : వ్యవసాయ చట్టాలు ఉపంసహరించుకోవాలి..లేకపోతే
వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ మరోసారి కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Delhi Formers
Centre Has Time Until November 26 : వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ మరోసారి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా…వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ…రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో ఢిల్లీ సరిహద్దుల వెంబడి ఆందోళనలు, నిరసనలు ఉధృతంగా సాగుతున్నాయి.
Read More : Badvel : ఉప ఎన్నిక కౌంటింగ్…ఏర్పాట్లు పూర్తి, గెలుపుపై వైసీపీ ధీమా
అయినా..కేంద్ర ప్రభుత్వం స్పందించకపోయేసరికి…తాజాగా…రాకేష్ టికాయత్ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. నవంబర్ 26వ తేదీలోగా…వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని అల్టీమేటం జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం తగ్గకపోతే…తమ పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చట్టాలను వెనక్కి తీసుకోకపోతే…ఉద్యమాన్ని దేశ వ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. 26వ తేదీ నాటికి ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపట్టి…ఏడాది కాలం పూర్తవుతున్న సందర్భంగా…నవంబర్ 27వ తేద నుంచి గ్రామాల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఢిల్లీ సరిహద్దులు ముట్టడిస్తామని రాకేష్ టికాయత్ వెల్లడించారు.
Read More : Suryapeta : ధాన్యం ట్రాక్టర్లను అడ్డుకున్న పోలీసులు.. సూర్యాపేట జిల్లాలో రైతుల ఆందోళన
సింఘు, గాజీపుర్, టిక్రీలలో 2020, నవంబర్ 26వ తేదీ నుంచి నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రైతులకు నిరసనలు కొనసాగించే హక్కు ఉందన, నిరవధికంగా రహదారులను దిగ్భందించరాదని వెల్లడించింది. ప్రస్తుతం రాకేష్ టికాయత్ చేసిన హెచ్చరికలపై కేంద్రం స్పందిస్తుందా ? లేదా ? అనేది చూడాలి.