Cheetahs: దక్షిణాఫ్రికా నుంచి చీతాలొచ్చేశాయ్.. కునో నేషనల్ పార్కులోకి విడుదల చేసిన మధ్యప్రదేశ్ సీఎం, కేంద్ర మంత్రి

తాజాగా మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు తరలించారు. వీటిని కునో పార్కులో వదిలారు. వీటికోసం పది క్వారంటైన్ ఎన్ క్లోజర్లను సిద్ధం చేశారు. ఇవి నెల రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచి అబ్జర్వు చేస్తారు. అనంతరం వీటిని అడవిలోకి వదిలేస్తారు.

Cheetahs: దక్షిణాఫ్రికా నుంచి చీతాలొచ్చేశాయ్.. కునో నేషనల్ పార్కులోకి విడుదల చేసిన మధ్యప్రదేశ్ సీఎం, కేంద్ర మంత్రి

Cheetahs that flew from South Africa.. MP CM and Union Minister released into Kuno National Park

Updated On : February 18, 2023 / 3:27 PM IST

Cheetahs: దక్షిణాఫ్రికా నుంచి మరికొన్ని చీతాలను భారత్‌కు చేరుకున్నాయి. దక్షిణాఫ్రికాతో ఒప్పందంలో భాగంగా జోహన్నెస్‌బర్గ్ నుంచి 12 చీతాలను వాయుసేనకు చెందిన సీ-17 విమానం ద్వారా శనివారం ఉదయం గ్వాలియర్ ఎయిర్ బేస్‌కు తరలించారు. ఇందులో ఏడు మగ, అయిదు ఆడ చీతాలు ఉన్నాయి. గ్వాలియార్ ఎయిర్ బేస్ నుంచి వీటిని శ్యోపూర్ జిల్లాలోని కునో జాతీయ పార్కుకు తరలించారు. మధ్యాహ్నం మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌లు  కునో నేషనల్ పార్కులోకి వీటిని విడుదల చేశారు. వీటికోసం కునో పార్కులో పది క్వారంటైన్ ఎన్ క్లోజర్లను సిద్ధం చేయగా.. నిబంధనల ప్రకారం నెలరోజుల పాటువీటిని క్వారంటైన్‌లో ఉంచనున్నారు.

Liquor Scam: మనీశ్ సిసోడియాకు మళ్లీ సమన్లు జారీ చేసిన సీబీఐ

1948 నుంచి భారతదేశంలో చీతాలు జాతి పూర్తిగా అంతరించిపోయింది. వాటి ఆనవాళ్లు కనుమరుగు కావటంతో ఇతర దేశాల నుంచి చీతాలను భారత్‌కు తరలించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వన్యప్రాణి జాతిని పున: ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతాను ప్రారంభించింది. ఇందుకోసం దక్షిణాఫ్రికాతో ఒప్పందం చేసుకున్నారు. తొలి విడతగా నమీబియా నుంచి ప్రత్యేక విమానంలో 74ఏళ్ల తరువాత ఎనిమిది చీతాలను భారత్‌కు తీసుకొచ్చారు. వీటిని ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజు సందర్భంగా గతేడాది సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో విడుదల చేశారు.

CCL 2023 : సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ మొదలు.. టైం అండ్ ప్లేస్ తెలుసా?