RTI పరిధిలోకి సీజేఐ కార్యాలయం

  • Published By: chvmurthy ,Published On : November 13, 2019 / 09:38 AM IST
RTI పరిధిలోకి సీజేఐ కార్యాలయం

Updated On : November 13, 2019 / 9:38 AM IST

సుప్రీం కోర్టు బుధవారం మరో చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది.  భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకువస్తూ తీర్పు చెప్పింది.  ఈమేరకు గతంలో ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పును సమర్ధిస్తూ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ  తీర్పు  వెలువరించింది.
 
న్యాయవ్యవస్ధలో  స్వతంత్రత అనేది జవాబుదారీతనాన్ని తప్పించుకోలేదంటూ ధర్మాసనంలోని మెజారిటీ సభ్యులు  స్పష్టం చేశారు. న్యాయవ్యవస్ధలో పారదర్శకత ఉండాలనీ… స్వతంత్రత, జవాబుదారీతనం రెండు కలిసి నడవాలనీ ధర్మాసనం పేర్కోంది.జస్టిస్ గొగోయ్‌తో పాటు జస్టిస్ ఎన్వీ రమణ, డీవై చంద్రచూడ్, దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నా తదితరులు ఈ రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్నారు.

సుప్రీం కోర్టు తోపాటు  చీఫ్ జస్టిస్ ఆఫీసులు కూడా ప్రభుత్వ సంస్ధలేనని  అవి ఆర్టీఐ పరిధిలోకి వస్తాయని 2010 లో ఢిల్లీ  హై కోర్టు తీర్పు చెప్పింది.దీన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు జనరల్  సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఏప్రిల్ 4న తీర్పు రిజర్వ్ లో పెట్టి ఈ రోజు తుది తీర్పు వెలువరించింది.