Punjab: పంజాబ్‭లో బీభత్సం.. పోలీసుల మీదకు కత్తులు దూసిన నిరసనకారులు

తొలుత పోలీసులపైకి నిరసనకారులు రాళ్లతో దాడి చేశారట. ఆ తర్వాతే పోలీసులు వారిపై వాటర్ ఫిరంగులను ప్రయోగించారని ప్రవీర్ రంజన్ అన్నారు. ఇక కొందరైతే బారికేడ్‌లను దాటడానికి కత్తులు దూసారని, మరికొందరు గుర్రాలను కూడా ఉపయోగించారని ఆరోపించారు. ఇందులో పలువురు పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది గాయపడినట్లు సమాచారం. చండీగఢ్ పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘర్షణలో మీడియా సిబ్బందికి కూడా గాయాలైనట్లు సమాచారం.

Punjab: పంజాబ్‭లో బీభత్సం.. పోలీసుల మీదకు కత్తులు దూసిన నిరసనకారులు

Clashes break out between protesters and police at Mohali-Chandigarh border

Updated On : February 9, 2023 / 11:02 AM IST

Punjab: మొహాలీ-చండీగఢ్ సరిహద్దులో బుధవారం చండీగఢ్ పోలీసులు, క్వామీ ఇన్సాఫ్ మోర్చా మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. షరతులు పూర్తయినా జైళ్లలో మగ్గుతున్న బండి సిక్కులను విడుదల చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. అయితే వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ తరుణంలో పోలీసుల మీదకు నిరసనకారులు కత్తులు దూయడం గమనార్హం.

Adani Group: 500 మిలియన్ డాలర్ల బ్యాంకు రుణాలు చెల్లించనున్న అదానీ

ఈ విషయమై చండీగఢ్ డీజీపీ ప్రవీర్ రంజన్ మాట్లాడుతూ “జనవరి 7 నుంచి మొహాలీ-చండీగఢ్ సరిహద్దులో క్వామీ ఇన్సాఫ్ మోర్చా ఏర్పాటు చేశారు. షరతులు పూర్తయిన తర్వాత కూడా జైళ్లలో మగ్గుతున్న బండి సిక్కులను విడుదల చేయాలని ఈ మోర్చాలో భాగమైన సిక్కు సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి” అని పేర్కొన్నారు. ఆందోళనకారులు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇంటి వైపు వెళ్తున్నారని, వారిని అడ్డుకునేందుకు పోలీసులు వాటర్ ఫిరంగులను ఉపయోగించాల్సి వచ్చిందని ఆయన అన్నారు.

Russian Oil: తోక ముడిచిన అమెరికా.. రష్యా నుంచి ఇండియా చమురు కొనడంపై అభ్యంతరం లేదట