తెలంగాణను మంచిగా చేశా.. ఇక దేశం సమస్యలు తేలుస్తా: కేసీఆర్

సీఎం కేసీఆర్.. కేంద్రంపై ధ్వజమెత్తారు. దేశంలో CAAఅమలుపై ప్రశ్నిస్తూ.. బీజేపీ గవర్నమెంట్ వైఖరిని ఎండగట్టారు. భారత దేశాన్ని హిందూదేశంగా మారుస్తున్నారని అనుకుంటున్నారు. ఇలాంటి కామెంట్లు వింటుండే సిగ్గుగా అనిపించిందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగరేసిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. జర్నలిస్టులు ఈ చట్టాలకు సహకరించొద్దని చేతులెత్తి మొక్కుతున్నానంటూ దేశ పురోగతి గురించి మాట్లాడారు.
❝ అవసరమైతే నేను లీడ్ తీసుకుంటా. తెలంగాణలో కొన్ని పనులు ఉన్నాయి. దేశం గురించి మాట్లాడటానికి కూడా కేసీఆర్ వెనుకాడడు. నేను మొదలుపెడితే దేశానికి వినపడేలా చెప్తా. గుడ్డిగా వినేసి కేంద్రానికి సపోర్ట్ చెయ్యం❞ కేంద్రం చేసిన CAA చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలకు తానే నాయకత్వం వహిస్తానని చెప్పారు.
ఇది ఉద్యమం అయితే తాను ముందుంటానని.. దీని కోసం హైదరాబాద్ లోనే మీటింగ్ పెడతానని, నాలుగు గోడల మధ్య చర్చించి నిర్ణయం తీసుకునే వ్యక్తులం కాదని అన్నారు. ❝ సీఏఏ అమలు అనేది కరెక్ట్ కాదు. అన్నీ రాష్ట్ర అసెంబ్లీలు వ్యతిరేకతగా చూపిస్తున్నాయి. రాజస్థాన్ సీఎం అడిగితే హైదరాబాద్ లో మాట్లాడదాం అన్నాను. దీని కోసం హైదరాబాద్ లో ముఖ్యమంత్రుల, ముఖ్యులతో మీటింగ్ ఏర్పాటు చేస్తా. 130కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఇది కరెక్ట్ కాదు❞
బీజేపీ నాయకులపై సెటైర్లు విసురుతూ.. స్పష్టత లేని వైఖరిని ఎండగట్టారు. ❝ ఇది దేశానికి మంచిది కాదు. హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ఎన్నార్సీ సమస్యనే కాదు.. ఎన్పీఆర్ (జాతీయ జనాభా నమోదు) మాత్రమే. కిషన్ రెడ్డి.. మేం ఎవ్వరినీ బలవంత పెట్టం. ఎవరికి వాళ్లు స్వచ్ఛందంగా నమోదు చేసుకోవడమే మీ ఇష్టం. మేం వద్దని చెప్పేయొచ్చా❞ అంటూ కామెంట్ చేశారు.
ఇక బీజేపీ స్వభావం మార్చుకోదా.. స్వతహాగా ఒప్పుకుని విరమించుకోవాలి. లేదంటే దీనిని దేశం స్వభావమే మారిపోతుంది. మతతత్వ దేశంగా పిలుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ❝ CAAపై దేశం అట్టుడికిపోతుంటే మొండిపట్టుదల ఎందుకని చూపిస్తున్నారు. దేశం మునిగిపోయే పరిస్థితి ఉంటే మౌనం పాటించడం దేశ భవిష్యత్ కు మంచిది కాదు. విదేశాలకు పోతే మనల్ని మతతత్వ దేశంగా పిలిచి అవమానిస్తారు. థర్డ్ క్లాస్ ఫెలోస్ అని చూస్తే దేశానికి మంచిది కాదు. వంద శాతం ఇది తప్పుడు బిల్లు. ఈ ఆలోచన తప్పు. విజ్ఞతతో విరమించుకోవాలి❞
విదేశీయులు భారత్ గురించి మాట్లాడుతున్న తీరు ఇబ్బందిగా, సిగ్గులా అనిపిస్తుందన్నారు. ❝ ఇంటర్నేషనల్ మార్కెట్ లో భారత్ దిగజారిపోతుందని జార్జి సోరెస్ అని చెప్పిన మాటలు చూసి సిగ్గేసింది. జార్జ్ సోరేస్ అనే వ్యక్తి భారత్ ను హిందూ దేశంగా మారుస్తున్నారని హెచ్చరించారు. భారత్ ప్రజల దేశం మత దేశం కాదు.. అది వృథా బ్రాండ్ దేశానికి మంచిది కాదు. సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ బిల్లును వ్యతిరేకిస్తూ డిమాండ్ చేస్తాం. అనేక సందర్భాల్లో రాష్ట్రం.. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసింది. ఇలాంటి చట్టాల విషయాల్లో వ్యతిరేకిస్తాం. డెమొక్రటిక్ గా ఏర్పాటైన ప్రభుత్వం ఇది. ప్రజలందరినీ వ్యతిరేకత వస్తుంటే పట్టించుకోవాలి❞
దేశంలో అందరూ మతాలకు అతీతంగా కలిసి ఉంటున్నారు. హిందూ ముస్లింలు అని విడదీసి పంచాయతీలు పెట్టి చేసే దందా ఏంటనిప్రశ్నిస్తూ ఇక ఎప్పుడూ ఇదే పనా.. అని తిట్టిపోశారు. ❝ మతకల్లోలాలు రాకుండా ఆరేళ్ల నుంచి చూస్తున్నాం. ఓ వర్గాన్ని పక్కకు పెట్టడమనేది వ్యర్థమైన విషయం. సుప్రీం కోర్టు ఈ కేసును సుమొటోగా తీసుకొని కొట్టిపారేయాల్సిన చట్టం. సిక్కు వ్యక్తి.. ఇవాళ ముస్లింలు పక్కకుపెట్టారు. రేపు సిక్కులను పక్కకుపెట్టరని అనుమానమేముంది❞
❝దవాఖానాలో హిందూ.. ముస్లింలు వేరుగా చూస్తారా. సమస్యేదీ లేదన్నట్లు ఇదే పట్టుకుని ఉంటున్నారు. ఆర్థిక వ్యవస్థ నాశనమైపోతుంది. ప్రజల దృష్టి మరల్చి చేసే దందా ఇదేనా. బైంసాలో జరిగిన ఘటనలో ర్యాపిడ్ ఫోర్స్ ను పంపించి శాంతం చేయించా. చీమ చిటుకుమనకుండా చేశా. ఇటువంటి శక్తులను ఉక్కుపాదంతో తొక్కిపారేస్తా. తెలంగాణ వచ్చింది ప్రోగ్రెస్ కావాలి. చిల్లర పంచాయతీలు చేస్తే లోపలేస్తా అనిచెప్పాం. అరాచకాలను సహించం. ఇప్పుడు మునిగిపోతుందా. హిందూ-ముస్లిం కలిసి బతకడం లేదా. మనోళ్లు గల్ఫ్ లో 25లక్షల మంది ఉన్నారు.. వాళ్లు పొమ్మంటే ఏం చేస్తాం❞
తెరాస స్పష్టంగా సెక్యూలర్ పార్టీ అని.. ఎక్కడైనా తమ విధివిధానాలను బహిరంగంగా, నిర్భయంగా చెప్పగలదని అన్నారు. ❝ సభలో నామా నాగేశ్వరరావును మాట్లాడమని నేనే చెప్పా. సచ్చినా ప్రాణాలు పోయినా సరే టీఆర్ఎస్ అనేది సెక్యూలర్ పార్టీ❞
❝ జార్ఖండ్ లో రామమందిరం అన్నావ్ ఏమైంది? ప్రజలే బుద్ధి చెప్పారు. పిచ్చోడ్ని అడిగినా కేజ్రీవాల్ కే ఓట్లు వేస్తా నంటున్నారు. ప్రపంచ దేశాలు అవలంభిస్తున్న పథకాలు .. ఫాలో అవ్వాలి. డెమొక్రటిక్ దేశంలో ఈ పనులు ఏంటి. పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం సమస్యలు ఉన్నాయి. కోట్ల మందిని బాధపెట్టడం సరికాదు. ప్రజాస్వామ్యంలో అటువంటి ఉప్పెన రాకుండా చూడాలి❞
❝ ముస్లింలు ఏం పాపం చేశారు. తెలంగాణలో ముస్లిం లేని పట్టణం ఉందా. వాళ్ల మధ్య చిచ్చు పెట్టి ఏం సాధిస్తాం. మీకు చేతులెత్తి దండంపెడతా.జర్నలిస్టులు దానికి సహకరించకండి❞
❝ ఈ దేశానికి ఎప్పుడైనా ఫెడరల్ విధానమే శ్రీరామ రక్ష. కర్రపెత్తనాలు పనికి రావు. మహామహులు ఓడిపోవడం లాంటివి చూశాం. ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ లాంటి వాళ్లే ఓడిపోయారు. ఇది ప్రజల దయ. వాళ్లకు నచ్చితే ఉంచుకుంటారు. లేదంటే తీసేస్తారు. ఈ దేశానికి పూర్తి స్థాయి ఫెడరల్ పార్టీ కానీ, ఇలాంటి విధానం ఉన్న పార్టీనే వచ్చే ఎన్నికల్లో గెలుస్తుంది. రెండు జాతీయ పార్టీలు(కాంగ్రెస్, బీజేపీ) ఫెయిలయ్యాయి❞
❝ నేను భయంకరమైన హిందువుని. నేను చేసిన యాగలు ఎవరూ చేయలేదు. బీజేపీ వాళ్లు చెప్తేనే చేశానా.. ఇది పనికిమాలిన దందా. ఇలాంటి సంకుచిత భావాలు భవిష్యత్ కు పనిచేయవు. ఇలాంటివి కాసేపే. వందల మంది లెటర్లు రాసి మరీ చెప్తున్నారంటే మంచి ఏంటో తెలియడం లేదా. ఇదెక్కడి దుర్మార్గం.. దేశంలో ప్రముఖులంతా చెప్తున్నారు.. ఇది ప్రతి రాష్ట్రంలోని పౌరునిపై ప్రభావం చూపిస్తుంది. మిలియన్ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతుంది. ఆర్థిక వ్యవస్థ ఇలా ఉండటం వల్లే దేశం ఇలాగే ఉంది❞
❝ అమిత్ షా ఎన్ని చెప్పినా మా నిరసన మేం తెలియజేస్తాం. ప్రజలే తేలుస్తారు. మాకు అన్ని మతాలు, కులాలు ఓట్లు పడ్డాయి కాబట్టే గెలిచాం. హిందూ ఉద్దేశాలు, సిద్ధాంతాలు మాత్రమే కావాలంటే మఠం పెట్టుకోవాలి. ప్రజాస్వామ్యం పేరిట ఇలాంటివి చేయకూడదు❞