Manish Sisodia Arrested: సిసోడియా చేతిలో 18శాఖల బాధ్యతలు.. ఆయన అరెస్టుతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం ..

ఢిల్లీలో ఆప్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వంలో సిసోడియా కీలక వ్యక్తిగా కొనసాగుతున్నారు. వరుసగా ఎనిమిది సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అతని చేతిలో 18 శాఖలు ఉన్నాయి. కీలకమైన శాఖల నిర్వహణ సిసోడియా పర్యవేక్షణలో జరుగుతుంది. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సిసోడియా అరెస్టు కావడం కేజ్రీవాల్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

Manish Sisodia Arrested: సిసోడియా చేతిలో 18శాఖల బాధ్యతలు.. ఆయన అరెస్టుతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం ..

Manish Sisodia

Updated On : February 28, 2023 / 8:45 AM IST

Manish Sisodia Arrested: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ నేత, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఆదివారం సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం విధితమే. సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా ఐదు రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. అయితే, సిసోడియా అరెస్టు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. సిసోడియా ఆప్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2015 నుంచి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. వరుసగా ఎనిమిది బడ్జెట్‌లను సిసోడియా సమర్పించారు. ప్రస్తుతం సిసోడియా ఆప్ ప్రభుత్వంలో 18శాఖలు చూస్తుండగా, 14 శాఖలను మిగిలిన నలుగురు మంత్రులు చూస్తున్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను సమర్పించనున్న నేపథ్యంలో సిసోడియా అరెస్టు సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారినట్లు చర్చజరుగుతుంది.

AAP Protests : మనీష్ సిసోడియా అరెస్ట్ కు వ్యతిరేకంగా ఆప్ నిరసనలు.. బీజేపీ కార్యాలయాల ముట్టడికి యత్నం

ఢిల్లీలో ఆప్ 2015లో అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి కేజ్రీవాల్ ప్రభుత్వంలో సిసోడియా కీలక వ్యక్తిగా కొనసాగుతున్నారు. వరుసగా ఎనిమిది సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సిసోడియా.. తొలిసారి ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేజ్రీవాల్ ఢిల్లీ మోడల్ కు పునాది వేసే బడ్జెట్‌ను తీసుకురావడంలో విజయవంతం అయ్యారు. విద్య, ఆరోగ్య రంగాలపై దృష్టిసారించి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అంతేకాక ఉచిత విద్యుత్, నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు ఇలా ఆప్ ప్రభుత్వంలో తొలినాళ్లలో అమల్లోకి తెచ్చిన పథకాలు ప్రజాదరణ పొందారు. తద్వారా రెండోసారి ఆప్ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డాయి.

Manish Sisodia: సీబీఐ కస్టడీకి మనీష్ సిసోడియా.. ఐదు రోజుల కస్టడీకి అనుమతించిన కోర్టు

సిసోడియా అరెస్టుతో ఆయన చేతిలోఉన్న 18శాఖల పనులను పర్యవేక్షించే బాధ్యత కేజ్రీవాల్ కు పెద్ద సవాల్ గా మారిందన్న టాక్ ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో సత్యేందర్ జైన్ అరెస్టయిన తరువాత ఆయన శాఖలను మనీశ్ సిసోడియాకు కేజ్రీవాల్ అప్పగించారు. దీంతో సత్యేంద్ర జైన్ నేతృత్వంలోని హోం శాఖకూడా సిసోడియా పర్యవేక్షణలోనే ఉంది. ప్రస్తుతం సిసోడియా ఐదు రోజుల కస్టడీ తరువాత బెయిల్ పై బయటకు వస్తేసరి, లేకుంటే సిసోడియా చూస్తున్న 18శాఖల బాధ్యతలను ఇతర మంత్రులకు అప్పగించాల్సి ఉంటుంది. సిసోడియా పర్యవేక్షలో ఉన్న శాఖలను మిగిలిన నలుగురు మంత్రులకు అప్పగించడం పెద్ద సవాలుతో కూడుకున్న పనేనన్న వాదన ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఆరోగ్యం దృష్ట్యా గోపాల్ రామ్ కు చాలా శాఖల బాధ్యతలు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కైలాష్ గెహ్లాట్ కూడా డీటీసీ బస్సు కొనుగోలు కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. మిగిలిన ఇద్దరు ఇమ్రాన్ హుస్సేన్, రాజ్ కుమార్ ఆనంద్ సాపేక్షంగా పెద్దగా అనుభవం లేని వ్యక్తులు. ఇలాంటి పరిస్థితుల్లో సిసోడియాకు త్వరలో కోర్టు ఉపశమనం లభించకపోతే ఆ శాఖలను నిర్వహించడం అరవింద్ కేజ్రీవాల్కు పెద్ద సవాలుగా మారనుంది.