ఓటు వేసిన CM కుమారస్వామి, కనిమొళి

  • Published By: veegamteam ,Published On : April 18, 2019 / 04:06 AM IST
ఓటు వేసిన CM కుమారస్వామి, కనిమొళి

Updated On : April 18, 2019 / 4:06 AM IST

దేశ వ్యాప్తంగా లోక్ సభ రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. వేసవికాలం రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు ఓట్లు వేసేందుకు ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా క్యూ కట్టారు. ఈ క్రమంలో కర్ణాటక సీఎం కుమార్ స్వామి..భార్య అనిత తో పాటు మాండ్య నియోజక వర్గంలోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. డిప్యూటీ సీఎం పరమేశ్వర్, ఆయన భార్య కన్నికతో కలిసి వచ్చి కోరటగేరా తుముకూర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.  DMK చీఫ్ స్టాలిన్ తీనంపేట్ లోని SIET కాలేజ్ పోలింగ్ కేంద్రంలోను..DMK అభ్యర్థి కనిమొళి చెన్నైలోని తుత్తుకుడి ఆల్వార్ పేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.   

ఆర్ ఎస్ ఎస్ నేత దత్తాత్రేయ హోసబలేలోని శేషాద్రిపురం 45వ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. బీజేపీ నేత శివగంగ నియోజక వర్గంలో హెచ్. రాజ్ కరైకుడిలో ఓటు వేశారు. అలాగే  సినీ ప్రముఖులు కూడా క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నటులు సూర్య-జ్యోతిక దంపతులు, కార్తీ, విజయ్, కమల్‌హాసన్, కుమార్తె శృతిహాసన్ క్యూలో నిలబడి ఓటు వేశారు.