Tamil Nadu CM : అదరగొట్టిన సీఎం స్టాలిన్.. ప్లాస్టిక్ కుర్చీలో ప్రజలతో
స్టాలిన్ తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పరిపాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రజల మధ్య ఉంటూ.. ప్రజల్లో తిరుగుతూ సీఎం అయినా.. తాను మిలో ఒకడినే అని చాటిచెబుతున్నారు.

Tamil Nadu Cm
Tamil Nadu CM : ఎం.కే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పరిపాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రజల మధ్య ఉంటూ.. ప్రజల్లో తిరుగుతూ సీఎం అయినా.. తాను మిలో ఒకడినే అని చాటిచెబుతున్నారు. తాజాగా ఆర్టీసీ బస్సు ఎక్కిన స్టాలిన్ ప్రయాణికులకు కరోనా జాగ్రత్తలు చెప్పారు.
చదవండి : CM Stalins : తన కాన్వాయ్‌ను నిలిపివేసి..అంబులెన్స్‌కు దారిచ్చిన సీఎం స్టాలిన్
ఎవరు మాస్క్ లేకుండా బయటకు రావద్దని సూచించారు. తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దని అధికారులకు చెప్పి ప్రజల హృదయాలు దోచాడు స్టాలిన్. సెక్యూరిటీ తనకు కాదని ప్రజలకు కావాలని ఆయన పదే పదే చెబుతున్నారు.
ఇలా ఊహించని రీతిలో తనదైన శైలితో సీఎం స్టాలిన్ ముందుకు సాగుతున్నారు. తాజాగా మరో అదిరిపోయే సీన్ చూడోచ్చు.. చెంగల్పట్టు జిల్లా తిరుక్కలుక్కుంరం సర్కిల్, పూన్చేరిలో నివాసముంటున్న నరిక్కువర్, ఇరులర్ వర్గానికి చెందిన 282 మంది లబ్దిదారులకు ప్రభుత్వ సంక్షేమ సహాయాన్ని సీఎం స్టాలిన్ అందించారు.
చదవండి : CM Stalin: స్టాలిన్ మరో సంచలన నిర్ణయం
అందరు సీఎంలా స్టేజీపై కూర్చోకుండా ప్రజల మధ్యలోనే ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుని లబ్ధిదారులతో ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శభాష్ సీఎం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.