CM Uddhav Thackeray : ఆస్పత్రిలో చేరిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆస్పత్రిలో చేరారు. కొద్దిరోజులుగా తీవ్ర మెడనొప్పితో బాధపడుతున్న సర్వైకిల్ చికిత్స నిమిత్తం ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరినట్టు ఒక ప్రకటలో వెల్లడించారు.

CM Uddhav Thackeray : ఆస్పత్రిలో చేరిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే

Cm Uddhav Thackeray Admitted To Hospital With Cervical Problem

Updated On : November 11, 2021 / 3:35 PM IST

CM Uddhav Thackeray : మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆస్పత్రిలో చేరారు. కొద్దిరోజులుగా తీవ్ర మెడనొప్పితో బాధపడుతున్న ఆయన సర్వైకిల్ చికిత్స నిమిత్తం ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరినట్టు ఒక ప్రకటలో వెల్లడించారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో కొవిడ్‌–19 పరిస్థితుల్లో అవిరామంగా పోరాటం కొనసాగిస్తూ తన మెడ నొప్పిని సైతం పట్టించుకోలేదని సీఎం ఉద్ధవ్ అన్నారు. మెడనొప్పి క్రమంగా తీవ్రమై ఇప్పుడు భరించలేనింతగా మారింది.

మెడనొప్పి నుంచి రిలీఫ్ అయ్యేందుకు ఆయన అప్పుడప్పుడు మెడపట్టీ ధరించారు కూడా. క్షణం కూడా తీరిక లేకుండా గడిపేశారు. తనను మెడనొప్పి వేధిస్తున్నప్పటికీ కేర్ చేయలేదు. కరోనా పరిస్థితులపై పోరాటంతో మెడ నొప్పిని సైతం ఆయన పట్టించుకోలేదు. ఉన్నట్టుండి మెడనొప్పి మరింత తీవ్రంగా మారడంతో సరైన చికిత్స కోసం ముంబై ఆస్పత్రిలో చేరారు.

రెండు నుంచి మూడు రోజులు ఆస్పత్రిలోనే చికిత్స పొందాలని వైద్యులు సూచించినట్టు సీఎం ఉద్ధవ్ పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులు తనకు ఉన్నాయని, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ముంబైలో ఏ ఆస్పత్రిలో చేరుతున్నారనే విషయాన్ని మాత్రం సీఎం ఉద్ధవ్ వెల్లడించలేదు. త్వరలో సర్వైకల్ పెయిన్‌కు సంబంధించి సర్జరీ చేయించుకునే అవకాశం ఉందని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
Read Also : T20 World Cup 2021: ధోనీ చెప్పినట్లుగా ఆడి జట్టును గెలిపించిన మిచెల్