Tejas Express : న్యూస్ పేపర్, వాటర్ బాటిల్ కోసం రూ. 20 ఇవ్వాలి…రైల్వే మంత్రికి కంప్లైంట్

రైల్వే శాఖ సూచించిన పేపర్, వాటర్ బాటిల్ తీసుకోవాలనే నిర్ణయంపై ఓ ప్రయాణికుడికి తీవ్ర ఆగ్రహం కల్పించింది. దీంతో డైరెక్ట్ గా రైల్వే మంత్రికి...

Tejas Express : న్యూస్ పేపర్, వాటర్ బాటిల్ కోసం రూ. 20 ఇవ్వాలి…రైల్వే మంత్రికి కంప్లైంట్

Chennai

Updated On : December 21, 2021 / 5:40 PM IST

Tejas Express : ప్రయాణంలో న్యూస్ పేపర్, వాటర్ బాటిల్ కోసం రూ. 20 ఇవ్వాల్సిందేనంటూ…రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమౌతోంది. ప్రయాణంలో చదవడం, చదవకపోవడం..నీళ్లు తాగకపోవడం ఎవరి ఇష్టం వారిది కానీ..రైల్వే శాఖ సూచించిన పేపర్, వాటర్ బాటిల్ తీసుకోవాలనే నిర్ణయంపై ఓ ప్రయాణికుడికి తీవ్ర ఆగ్రహం కల్పించింది. దీంతో డైరెక్ట్ గా రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. మూర్తి అనే వ్యక్తి…చెన్నై నుంచి మథురైకి తేజస్ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణించాడు. ఆయనకు కేటాయించిన సీట్ లో ఓ వార్త పత్రిక, వాటర్ బాటిల్ ఉంది. తోటి ప్రయాణీకుల సీట్లలో కూడా అవే ఉన్నాయి.

Read More : Central Government : 20 యూట్యూబ్ ఛానళ్లకు కేంద్రం షాక్

కొద్దిసేపటి అనంతరం టికెట్ కలెక్టర్ వచ్చి..రూ. 20 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తాను కట్టనని, తనిష్టం అని ఖరాఖండిగా చెప్పాడు. ఇతరులు డబ్బులు చెల్లిస్తున్నారని చెప్పినా తాను డబ్బులు మాత్రం ఇవ్వనని మరోసారి చెప్పడంతో అక్కడి నుంచి టికెట్ కలెక్టర్ వెళ్లిపోయారు. ఈ విషయాన్ని…కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ కు ఫిర్యాదు చేశారు. ఇలాంటి బలవంతపు వసూళ్లను ఆపేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఐఆర్ సీటీసీ (IRCTC)…స్పందించింది.

Read More : Amit Shah : టార్గెట్ టీఆర్ఎస్.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలన్న అమిత్ షా

రైల్వే బోర్డు పాలసీ ప్రకారం…తేజస్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించే వారికి న్యూస్ పేపర్, వాటర్ బాటిళ్లను ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని, తాము నిర్ణయించిన దినపత్రికను మాత్రమే చదవాలన్న నిబంధన ఏమీ లేదని చెప్పుకొచ్చింది. ఇతర దినపత్రికలను కూడా ఎంచుకొనే స్వేచ్చ ప్రయాణీకులకు ఉందని ఐఆర్ సీటీసీ జాయింట్ జనరల్ మేనేజర్ గోల్డ్ స్టోన్ వెల్లడించారు.