CWC: ఈవీఎంలపై దేశ వ్యాప్త ఆందోళనకు కార్యాచరణ? కాంగ్రెస్ సీడబ్ల్యూసీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
సీడబ్ల్యూసీ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.

కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీ ఇవాళ మధ్యాహ్నం 2.30గంటలకు సమావేశం కానుంది. ఈవీఎంలపై దేశ వ్యాప్త ఆందోళనకు కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్.
బ్యాలెట్ ద్వారానే ఇకపై ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. పలు రాష్ట్రాల్లో సంస్థాగతంగా ఉన్న సమస్యలపై కూడా సీడబ్ల్యూసీలో సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. కులగణనపై దేశ వ్యాప్తంగా కార్యక్రమం చేపట్టేందుకు కార్యాచరణపై చర్చించనున్నారు. వచ్చే ఏడాది జరిగే ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల ఎన్నికల వ్యూహంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
సీడబ్ల్యూసీ భేటీకి హాజరు కావాలని ముగ్గురు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సిఎంలకు ఆహ్వానం అందింది. సీడబ్ల్యూసీ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి సీడబ్ల్యూసి సభ్యులుగా దామోదర్ రాజనర్సింహ, వంశీచంద్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ నుంచి రఘువీరారెడ్డి, కొప్పుల రాజు, సుబ్బిరామిరెడ్డి, గిడుగు రుద్రరాజు, పల్లంరాజు ఉన్నారు.
Mamata Banerjee: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై మమతా బెనర్జీ కామెంట్స్