జాతీయ గిరిజన నృత్యోత్సవం : డోలు వాయించి..స్టెప్పులేసిన రాహుల్

గిరిజనులతో కలిసి..డోలు పట్టుకుని లయబద్ధంగా స్టెప్పులేశారు రాహుల్ గాంధీ. రాహుల్ డ్యాన్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. 2019, డిసెంబర్ 27వ తేదీ రాయ్ పూర్‌కు రాహుల్ వచ్చారు. జాతీయ గిరిజన నృత్యోత్సవాన్ని ప్రారంభించి..అందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారితో కలిసి డ్యాన్స్ చేశారు.
అచ్చం గిరిజనులలాగానే తలపాగా ధరించిన రాహుల్..మెడలో డోలు వేసుకున్నారు. గిరిజనులతో కలిసి లయబద్ధంగా ఆడారు. ఛత్తీస్ గడ్ సీఎం భూపేశ్ బాగెల్, ఇరత పార్టీ లీడర్స్ రాహుల్‌తో కలిసి ఆడారు. ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో తొలిసారిగా జాతీయ గిరిజన నృత్యోత్సవం జరుగుతోంది. మూడు రోజుల డ్యాన్స్ ఫెస్ట్‌లో 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఆరు దేశాల నుంచి వేయి 350 మంది పాల్గొంటారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
* తొమ్మిది గిరిజన కళా బృందాలు వేర్వేరు నృత్య రూపాల్లో 43 రకాల డ్యాన్స్‌లు ప్రదర్శించనున్నారు.
* వివాహాలు, ఇతర ఆచారాలు, సాంప్రదాయ ఉత్సవాలు, జానపద నృత్య రూపాల ఆధారంగా మొదటి రోజు పోటీలు జరుగుతాయి.
* డిసెంబర్ 28న ఉదయం 9 గంటల నుంచి గుజరాత్ కళాకారులు, ఏపీ కళాకారుల నృత్య ప్రదర్శన ఉంటుంది. త్రిపుర మమిథ డ్యాన్స్ ప్రదర్శన కూడా ఉంటుంది.
Read More : ఫిలిప్పీన్స్‌లో ఫాన్ ఫోన్ తుఫాన్ బీభత్సం..28 మంది మృతి
* మూడో రోజు ఉత్తరాఖండ్ లష్పా నృత్యం, జమ్మూ బకర్వాల్, మధ్యప్రదేశ్ భదమ్, హిమచాల్ ప్రదేశ్ గాడి నృత్యం, కర్నాటక, సిక్కిం ఫోక్ డ్యాన్స్, ఇలా పలు రాష్ట్రాలకు చెందిన వారు నృత్య ప్రదర్శన చేస్తారు.
* గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, అహ్మద్ పటేల్, మోతీలాల్ వోరా తదితరులు ఉత్సవాల్లో పాల్గొంటారు.
* దందామి మాడియా తెగకు చెందిన ఈ నృత్యం బాగా ప్రాచుర్యం పొందింది. దీనిని గౌర్ డ్యాన్స్ అని కూడా అంటారు. మగ, ఆడవారు కలిసి ఆడుతుంటారు. మగవారు బైసన్ హార్న్ కిరిటాని ధరించి డోలు వాయిస్తుంటారు.
#WATCH Chhattisgarh: Congress leader Rahul Gandhi takes part in a traditional dance at the inauguration of Rashtriya Adivasi Nritya Mahotsav in Raipur. pic.twitter.com/HpUvo4khGY
— ANI (@ANI) December 27, 2019