Sonia Gandhi : ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ..
సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు అనే వార్త కాంగ్రెస్ శ్రేణులను ఆందోళనకు గురి చేసింది.

Sonia Gandhi : కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాందీ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం డాక్టర్ల బృందం అబ్జర్వేషన్ లో సోనియా గాంధీ ఉన్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, శుక్రవారం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
సోనియా గాంధీ వయసు 78 ఏళ్లు. సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు అనే వార్త కాంగ్రెస్ శ్రేణులను ఆందోళనకు గురి చేసింది. సోనియా ఆరోగ్య పరిస్థితి గురించి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు వాకబు చేస్తున్నారు. అసలు ఆమెకు ఏమైందో తెలియక కంగారుపడుతున్నారు. గురువారం ఉదయం సోనియ గాంధీ గంగా రామ్ హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్లు సమాచారం.
Also Read : ఢిల్లీ సీఎంగా రేఖాగుప్తా ప్రమాణం.. కొత్త మంత్రివర్గం ఇదే.. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరు
సోనియా గాంధీ ఉదర సంబంధిత సమస్య కారణంగా ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లు గంగా రామ్ హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ మేనేజ్ మెంట్ ఛైర్మన్ అజయ్ స్వరూప్ చెప్పారు. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, శుక్రవారం ఉదయానికి ఆమె డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందన్నారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు డాక్టర్ సమీరన్ నండీ పర్యవేక్షణలో సోనియా గాంధీ ఉన్నట్లు సమాచారం. పార్లమెంట్ లో బడ్జెట్ సెషన్ సందర్భంగా ఫిబ్రవరి 13న సోనియా గాంధీ కనిపించారు.