కాంగ్రెస్ కీలక నేతల సమావేశం

  • Published By: chvmurthy ,Published On : January 2, 2019 / 04:30 PM IST
కాంగ్రెస్ కీలక నేతల సమావేశం

ఢిల్లీ: ఏఐసీసీ వార్  రూమ్ లో  కాంగ్రెస్ కీలక నేతలు బుధవారం సమావేశం అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికలపై కాంగ్రెస్ కోర్ కమిటీ చర్చిస్తోంది. ఏకే ఆంటోనీ నేతృత్వంలో జరుగుతున్న ఈసమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు అశోక్ గెహ్లాట్, అహ్మద్ పటేల్,మల్లిఖార్జున ఖర్గే,గులాంనబీఆజాద్, చిదంబరం తోపాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గోన్నారు. ఇటీవల జరిగిన  అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన నేపథ్యంలో అదే ఉత్సాహంతో దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని నేతలకు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ  దిశానిర్దేశం చెయ్యనున్నారు.   
రానున్న సాధారణ ఎన్నికలకు పార్టీని సంస్థాగతంగా సిద్ధం చేయడం, రాష్ట్రాల వారీగా బలపడటం, ఎన్నికల ఎజెండాలో దృష్టి సారించాల్సిన అంశాలపై కూడా  నాయకులు చర్చించే అవకాశం ఉందని పార్టీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు తెలిపారు. ఏపీలో తెలుగుదేశం,కాంగ్రెస్ పార్టీల పొత్తు పై చర్చించే అవకాశం లేదని, 2019 ఎన్నికల్లో పొత్తులకు సంబంధించిన నిర్ణయాలు రాహుల్ గాంధీ తీసుకుంటారని రుద్రరాజు అన్నారు.