Congress new president: సెప్టెంబరు 20లోగా కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు.. రేసులో ఉన్నది వీరే..
కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆసక్తికనబర్చట్లేదు. రాహుల్ గాంధీ అధ్యక్షుడు అవడానికి సుముఖంగా లేకపోతే సోనియా గాంధీయే కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉండి ఆమెకు సహాయంగా కనీసం ముగ్గురు సీనియర్ నాయకుల్ని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో నియమించాలని కొందరు సీనియర్లు అంటున్నారు. అలాగే, గాంధీ-నెహ్రూయేతర కుటుంబాల్లోని వారికి పార్టీ పగ్గాలు అప్పగించి రాహుల్ గాంధీ వారికి ఒక గైడ్‌లా వ్యవహరిస్తే కుటుంబ రాజకీయాల విమర్శల నుంచి బయటపడవచ్చని మరి కొందరు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో మల్లికార్జున ఖర్గే, అశోక్ గహ్లోత్, సుశీల్ కుమార్ షిండే, డీకే శివకుమార్ కూడా ఉన్నారు.

Congress new president
Congress new president: కాంగ్రెస్ పార్టీ నేతలు సెప్టెంబరు 20లోగా కొత్త అధ్యక్షుడి ఎన్నుకోనున్నారు. సెప్టెంబరు మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీ కొత్త సారథి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం నామినేషన్ తేదీని నిర్ణయించేందుకు త్వరలో సీడబ్ల్యూసీ సమావేశం కానుంది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సెప్టెంబరు 7 నుంచి కాంగ్రెస్ భారత్ జోడో పాదయాత్ర (3500 కిలోమీటర్లు) ప్రారంభం కానుంది. పాదయాత్రలో రాహుల్ గాంధీ తో పాటు సీనియర్లు అందరూ పాల్గొనాలని ఇప్పటికే పార్టీ చెప్పింది.
కాంగ్రెస్ పాదయాత్ర ప్రారంభానికి ముందే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే భారత్ జోడో పాదయాత్ర రూట్ మ్యాప్ రూపుదిద్దుకుంది. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆసక్తికనబర్చట్లేదు. రాహుల్ గాంధీ అధ్యక్షుడు అవడానికి సుముఖంగా లేకపోతే సోనియా గాంధీయే కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉండి ఆమెకు సహాయంగా కనీసం ముగ్గురు సీనియర్ నాయకుల్ని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో నియమించాలని కొందరు సీనియర్లు అంటున్నారు.
అలాగే, గాంధీ-నెహ్రూయేతర కుటుంబాల్లోని వారికి పార్టీ పగ్గాలు అప్పగించి రాహుల్ గాంధీ వారికి ఒక గైడ్‌లా వ్యవహరిస్తే కుటుంబ రాజకీయాల విమర్శల నుంచి బయటపడవచ్చని మరి కొందరు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో మల్లికార్జున ఖర్గే, అశోక్ గహ్లోత్, సుశీల్ కుమార్ షిండే, డీకే శివకుమార్ కూడా ఉన్నారు.
Virushka scooty ride: అనుష్మను ఎక్కించుకుని ముంబైలో స్కూటీపై చక్కర్లు కొట్టిన విరాట్ కోహ్లీ