Bharat Jodo Yatra: ఈ యాత్ర కాంగ్రెస్‌కి సంజీవనిలాంటిది.. ఇప్పుడు పార్టీ మరో కొత్త అవతారంలో కనపడుతుంది: జైరాం రమేశ్

‘భారత్ జోడో యాత్ర’ కాంగ్రెస్ పార్టీకి సంజీవనిలాందని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ అన్నారు. నిన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కన్యాకుమారిలో ‘భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ జైరాం రమేశ్ మాట్లాడుతూ... ‘‘ఆ యాత్ర కాంగ్రెస్ కు సంజీవనిలాంటిదని నేను 100 శాతం నమ్ముతున్నాను. ఇది కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం ఇస్తుంది. కాంగ్రెస్ పునరుద్ధరణ జరిగి, కొత్త అవతారం ఎత్తుతుంది. 137 ఏళ్ళుగా కాంగ్రెస్ ఎన్నో అవతారాల్లో కనపడింది. ఇప్పుడు మరో కొత్త అవతారంలో కనపడుతుంది’’ అని జైరాం రమేశ్ అన్నారు.

Bharat Jodo Yatra: ఈ యాత్ర కాంగ్రెస్‌కి సంజీవనిలాంటిది.. ఇప్పుడు పార్టీ మరో కొత్త అవతారంలో కనపడుతుంది: జైరాం రమేశ్

AICC President election

Updated On : September 8, 2022 / 8:57 PM IST

Bharat Jodo Yatra: ‘భారత్ జోడో యాత్ర’ కాంగ్రెస్ పార్టీకి సంజీవనిలాందని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ అన్నారు. నిన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కన్యాకుమారిలో ‘భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ జైరాం రమేశ్ మాట్లాడుతూ… ‘‘ఆ యాత్ర కాంగ్రెస్ కు సంజీవనిలాంటిదని నేను 100 శాతం నమ్ముతున్నాను. ఇది కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం ఇస్తుంది. కాంగ్రెస్ పునరుద్ధరణ జరిగి, కొత్త అవతారం ఎత్తుతుంది. 137 ఏళ్ళుగా కాంగ్రెస్ ఎన్నో అవతారాల్లో కనపడింది. ఇప్పుడు మరో కొత్త అవతారంలో కనపడుతుంది’’ అని జైరాం రమేశ్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇకపై మరింత దూకుడుగా ముందుకు వెళ్తుందని జైరాం రమేశ్ చెప్పారు. మరింత చురుకుగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటుందని అన్నారు. తాము ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో లేకపోయినప్పటికీ, ప్రతి నగరం, గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పారు. భారత్ జోడో యాత్రపై బీజేపీ నేతలు చేస్తోన్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. తాము తమ యాత్రపైనే పూర్తిగా దృష్టి సారించామని చెప్పారు. ఆ యాత్రపై బీజేపీ ఎంతగా మాట్లాడితే ఆ పార్టీ నేతలు అంతగా భయపడుతున్నట్లు స్పష్టమవుతుందని అన్నారు.

Heavy Rains In Telangana : తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్