ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు అస్వస్ధత

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అస్వస్ధతకు గురయ్యారు. ఆయనకు కరోనా లక్షణాలైన గొంతు నొప్పి, జ్వరంతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్ లోకి వెళ్లినట్లు ఢిల్లీ సీఎం కార్యాలయం తెలిపింది. ఆయన తన అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు. రేపు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. కాగా ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు 30 వేలకు చేరుకుంటున్నాయి. లాక్ డౌన్ నిబంధనల సడలింపు విషయంలో ప్రభుత్వం కొంత కఠినంగా ఉంది.
గత 24 గంటల్లో భారత దేశంలో అత్యధికంగా 9,983 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 2,56,611కు చేరింది. 24 గంటల్లో వైరస్ కారణంగా 206 మంది మృతి చెందగా.. ఇప్పటివరకు మొత్తం 7,135 మంది కరోనాతో మృతి చెందారు.