India Covid : 12 లక్షల మందికి పరీక్షలు…11 వేల కేసులు
గత 24 గంటల్లో 11 వేల 466 కొత్త కేసులు వెలుగు చాశాయి. 12,78,728 మందికి పరీక్షలు నిర్వహించినట్లు..కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

India Covid
Corona Virus : భారతదేశంలో కరోనా అదుపులోకి వస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అదే సమయంలో..రికవరీ రేటు శాతం కూడా పెరుగుతోంది. గత 24 గంటల్లో 11 వేల 466 కొత్త కేసులు వెలుగు చాశాయి. 12,78,728 మందికి పరీక్షలు నిర్వహించినట్లు..కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో వైరస్ బారిన పడి…460 మంది చనిపోయారని తెలిపింది. గత సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు భారత్ లో 3.43 కోట్ల మందికి కరోనా సోకినట్లు, వీరిలో వైరస్ జయించిన వారి సంఖ్య 3.37 కోట్లకు పైనే ఉంటుందని పేర్కొంది.
Read More : Mithali Raj biopic: మిథాలీ బయోపిక్‌లో తాప్సీ.. లిరిక్స్ లీక్
గత 24 గంటల్లో 11 వేల 961 మంది కోలుకున్నట్లు, రికవరీ రేటు 98.25 శాతానికి చేరుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి అదుపులో ఉండడంతో యాక్టివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం వైరస్ తో బాధ పడుతున్న వారి సంఖ్య 1.39 లక్షలకు చేరిందని, క్రియాశీల రేటు 0.41 శాతానికి తగ్గిందన్నారు.
Read More : Virat Kohli: ‘కోహ్లీ టీ20 కెప్టెన్సీ రాజీనామా.. టీమిండియా డ్రెస్సింగ్ రూంలో ఏదో జరుగుతున్నట్లే..’
2021, నవంబర్ 09వ తేదీ మంగళవారం 52,69,137 మంది టీకా వేయించుకున్నారని, ఇప్పటి వరకు 109 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశారు. మరోవైపు..కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ తో చనిపోయిన వారి సంఖ్య భారీగా ఉంటోందని తెలుస్తోంది. 460 మంది మరణాలు సంభవిస్తే…384 కేరళ నుంచి వచ్చినవి కావడం..ఆందోళన కలిగిస్తోంది.