3జోన్లుగా లాక్ డౌన్ మార్గదర్శకాలు…కేంద్రం కొత్త ఆలోచన

  • Published By: venkaiahnaidu ,Published On : April 12, 2020 / 11:54 AM IST
3జోన్లుగా లాక్ డౌన్ మార్గదర్శకాలు…కేంద్రం కొత్త ఆలోచన

Updated On : April 12, 2020 / 11:54 AM IST

కరోనా వైరస్ నేపథ్యంలో దేశాన్ని జోన్లుగా విభజించే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. వైరస్ ఉదృతిని బట్టి వివిధ ప్రాంతాలను రెడ్,ఆరెంజ్,గ్రీన్ రంగులతో గుర్తించాలని నిర్ణయించారు. 15కేసుల కంటే తక్కువ కేసులు ఉన్న, మళ్లీ కొత్త కేసులు నమోదుకాకుండా ఉంటే ఆ ప్రాంతాలను ఆరెంజ్ జోన్ గా, 15 కేసుల కన్నా ఎక్కువ ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా,వైరస్ ప్రభావం లేని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా గుర్తించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా గ్రీన్ జోన్ పరిధిలోకి కరోనా ప్రభావం లేని 400 జిల్లాలు రానున్నాయి. ఈ 400 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా లేదు. జోన్ల వారిగా దేశంలో లాక్ డౌన్ పై హోంశాఖ మార్గదర్శకాలు ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గ్రీన్,ఆరెంజ్ జోన్లలో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ పరిమిత స్థాయిలో ప్రారంభించడం,వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు అనుమతించనున్నారు.

 ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న మాట్లాడుతూ… “నా మొదటి ప్రసంగంలో ‘జన్ హై తో జహాన్ హై (జీవితం ఉంటే, ప్రపంచం ఉనికిలో ఉంటుంది)అని చెప్పాను. మనం ఇప్పుడు జాన్ బీ,జహాన్ బీ వైపు చూడాలి అని అన్నారు.

శనివారం 13రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియోకాన్షరెన్స్ తర్వాత లాక్ డౌన్ పొడిగించబడుతుందని మోడీ ఇండికేషన్ ఇచ్చారు. అయితే కొన్ని ఏరియాల్లో మాత్రం సడలింపులు ఉంటాయని,ఆర్థికవ్యవస్థ కోలుకోవడం కోసం కొన్నిచోట్ల మినహాయింపులు ఉండవచ్చని సూచించారు. ఇక లాక్ డౌన్ పొడిగింపుపై అధికారికంగా త్వరలో నిర్ణయం వెలువడనుంది. ఏప్రిల్ 14తో ప్రధాని ప్రకటించిన 21రోజుల లాక్ డౌన్ ముగియనున్న విషయం తెలిసిందే.