కేరళ సీఎం: రూ. 20 వేల కోట్లతో ప్యాకేజీ.. రాష్ట్రమంతటా ఉచిత బియ్యం

  • Published By: madhu ,Published On : March 20, 2020 / 02:22 AM IST
కేరళ సీఎం: రూ. 20 వేల కోట్లతో ప్యాకేజీ.. రాష్ట్రమంతటా ఉచిత బియ్యం

Updated On : March 20, 2020 / 2:22 AM IST

భారతదేశంలో కరోనా విజృంభిస్తోంది. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా భయకంపితులను చేస్తోంది. వేలాది మంది బలి తీసుకొంటోంది. మొదటి కేసు నమోదైంది కేరళ రాష్ట్రంలో. దీంతో అక్కడి పినరయి విజయన్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వైరస్ వ్యాపించకుండా..కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. వైరస్ వ్యాపించకుండా..ఎలాంటి ఏర్పాట్లు చేశారనే దానిపై పలు రాష్ట్రాలు బృందాలు కేరళ రాష్ట్రానికి వచ్చాయి.

తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. రూ. 20 వేల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించింది. అంతేగాకుండా..నెలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించనున్నట్లు వెల్లడించింది. పెన్షనర్లు, ఇతర వారికి కూడా సహాయక చర్యలను ప్రకటించారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కేరళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. మరలా గాడిలో పెట్టేందుకు రూ. 20 కోట్ల విలువైన ఆర్థిక ప్యాకేజీని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు.

ఈ డబ్బు..ఆరోగ్యానికి సంబంధించి, సంక్షేమ పెన్షన్లు, ఉచితంగా ఆహార ధాన్యాలు, సబ్సిడీతో కూడిన భోజనం, పన్ను బకాయిలు ఇతరత్రా వాటికి ఖర్చు చేయనున్నారు. ఈ వైరస్ వల్ల..సాధారణ జీవితం దెబ్బతిన్నదని, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి..తాము ఈ ప్యాకేజీని ప్రకటించడం జరిగిందని పినరయి విజయన్ వెల్లడించారు.ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా..ఒక నెల పాటు ఉచితంగా బియ్యం ఇస్తామన్నారు.

ఎగువ మధ్య తరగతి కుటుంబాలకు మొత్తం 10 కిలోల తృణ ధాన్యాలు ఇవ్వబడుతాయని, ఇందుకు రూ. 100 కోట్లు కేటాయించామన్నారు. ‘కుడుంబ శ్రీ’ పథకం ద్వారా రూ. 2 వేల కోట్ల రూపాయలు అవసరమైన కుటుంబాలకు పంపిణీ చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో సుమారు 50 లక్షల మందికి వివిధ రకాల సామాజిక పెన్షన్లు అందుతున్నాయని, అయితే..పెన్షన్‌ను ఏప్రిల్ నెలలో ఇవ్వాల్సి ఉంటుందని..కానీ..తాము..రెండు నెలల పెన్షన్‌‌ను పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు.

సామాజిక భద్రత పెన్షన్ తీసుకోని కుటుంబాలు కూడా ఉన్నాయని చెప్పిన ఆయన..ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 1000 ఇస్తామని..ఇందుకు రూ. 100 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. విద్యుత్, నీటి బిల్లుల చెల్లింపు వ్యవధిని పొడగించడం జరుగుతుందని, జరిమాన చెల్లించకుండానే బిల్లులు చెల్లించవచ్చన్నారు. రూ. 25 భోజనాన్ని రూ. 20కి పంపిణీ చేస్తామన్నారు.

సెప్టెంబర్ నాటికి ఫుడ్ స్టాల్స్‌ని ప్రారంభించాల్సి ఉందని, అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాధ్యం కావడం లేదని అయినా..ఏప్రిల్ నాటికి వేయి ఆహార దుకాణాలను ప్రారంభిస్తామని పినరయి తెలిపారు. సినిమా థియేటర్లకు వినోద పన్నును కూడా ప్రకటించారు. ఆటో, బస్ ఆపరేటర్లకు రాయితీలు ప్రకటించారు. ఆటో రిక్షాకు ఫిట్ నెస్ ఫీజును సడలించారు.

బస్సుల్లో స్టేజ్ క్యారేజ్, కాంట్రాక్ట్ క్యారేజీ, కాంట్రాక్ట్ క్యారేజీకి పన్ను మినహాయించారు. స్టేజ్ క్యారియర్‌లకు మూడు నెలల పన్నులో ఒక నెల మినహాయింపు ఇవ్వనున్నారు. అంతేగాకుండా..ప్రజల ఆరోగ్య సమస్యలను తీర్చడానికి రూ. 500 కోట్ల ఆరోగ్య ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 

See Also | రోనా..విదేశీ ప్రయాణం చేసిన వారు గృహ నిర్భందం : తెలంగాణాలో 18 చెక్ పోస్టులు ఇవే